Road Accident | తిమ్మాపూర్, మే18: కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ శివారులో రాజీవ్ రహదారిపై ట్రాక్టర్‌ను ఓ డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ రైతు మరణించాడు.
వివరాల్లోకి వెళ్తే.. గన్నేరువరం మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన కాంతాల రాజిరెడ్డి అనే రైతు కరీంనగర్ వైపు వెళ్తుండగా కొత్తపల్లి దాటిన తర్వాత నూస్తులాపూర్ శివారులో అతివేగంగా వచ్చిన ఓ డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్‌పై వెళ్తున్న రాజిరెడ్డి ఎగిరి కిందపడ్డాడు. అదే సమయంలో డీసీఎం అతనిపై నుంచి వెళ్లింది. ఈ ఘటనలో రాజిరెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు.
స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన డీసీఎం డ్రైవర్ కోసం గాలిస్తున్నారు.