Jewellery Robbery | చందానగర్‌లో బాలాజీ జ్యువెలరీలో భారీ చోరీ.. రంగంలోకి పోలీసుల బృందం
Jewellery Robbery | చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు, వెనుక గది నుంచి ముందు గదికి మధ్య ఉన్న తలుపుకు కూడా రంధ్రం చేసి షాప్‌లోని బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
Jewellery Robbery | కొండాపూర్, ఆగస్టు 1 : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ జ్యువెలరీ షాప్‌లో శుక్రవారం అర్ధరాత్రి భారీ దొంగతనం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చందా నగర్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కనే ఉన్న బాలాజీ జ్యూవెలరీ షాప్ వెనుక భాగంలోని ఎగ్జాస్ట్ ఫ్యాన్‌ను తొలగించి గోడకు రంధ్రం చేసి లోపలికి ప్రవేశించిన దుండగులు, వెనుక గది నుంచి ముందు గదికి మధ్య ఉన్న తలుపుకు కూడా రంధ్రం చేసి షాప్‌లోని బంగారు, వెండి ఆభరణాలను ఎత్తుకెళ్లారు.
ప్రాథమిక అంచనా ప్రకారం సుమారు 7 తులాల బంగారం, 4 కిలోల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే డీసీపీ చింతమనేని శ్రీనివాస్, ఏసీపీ సీహెచ్. వై. శ్రీనివాస్ కుమార్, సీసీఎస్, ఎస్వోటీ, చందానగర్ పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఘటన స్థలంలో క్లూస్ టీమ్, ఫోరెన్సిక్ నిపుణులు ఆధారాలు సేకరిస్తున్నారు. సీసీటీవీ పుటేజీతోపాటు సాంకేతిక ఆధారాలను పరిశీలిస్తూ అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు పోలీసులు తెలిపారు.

Read Also :
Watch: పెళ్లి కోసం ఒత్తిడి చేసిన ప్రియురాలు.. బైక్‌తో ఈడ్చుకెళ్లిన వ్యక్తి
Watch: రైతుల నిరసన సందర్భంగా.. ధైర్యంగా బస్సు ముందు నిల్చొన్న మహిళా పోలీస్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhaskar Rao | సింగరేణి లాభాల తగ్గుదలపై సమగ్ర నివేదిక విడుదల చేయాలి : మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
పంచాయతీ అధికారి పర్సంటేజీల దందా ?
Weight Loss Surgery | కౌమారదశలో ఉన్న వారికి బరువు తగ్గించే శస్త్ర చికిత్సలు అవసరమా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పింది..?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సుంకరి భిక్షంగౌడ్
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

