Odela Mallanna Temple | ఓదెల, జూలై 30 : పెద్దపల్లి జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డును నియమిస్తూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేశారు. 13 మంది పాలకవర్గ సభ్యులతో నియామక ఉత్తర్వులు వెలుపడ్డాయి. జంగం కొమురయ్య( కొలానూర్), కోదాటి మనోహర్రావు( షానకొండ), జీలుక రవీందర్( రూపు నారాయణపేట), కట్కూరి సమ్మిరెడ్డి( జీలకుంట), కొండ శ్రీనివాస్ గౌడ్( కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి), తాళ్లపల్లి శ్రీనివాస్( కనగర్తి), నాగపురి రవి గౌడ్( ఓదెల), చీకట్ల మొండయ్య( ఓదెల), తీర్థాల రాజారం( ఓదెల), వీరవేని రవి( నాంసాని పల్లి), ఉప్పుల శ్రావణ్ కుమార్( కాల్వ శ్రీరాంపూర్ మండలం వెన్నంపల్లి), గంటా రమేష్( హరిపురం), సామల యమునా( సుల్తానాబాద్) లను ట్రస్టు బోర్డు సభ్యులుగా నియమించారు.
ఇందులో చీకట్ల మొండయ్య చైర్మన్గా ఎన్నిక లాంఛనమే కానుంది. ఎమ్మెల్యే విజయ రమణారావు ఇప్పటికే చైర్మన్ గా మొండయ్య పేరును ప్రకటించారు. త్వరలోనే ట్రస్టు బోర్డు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావుకు పాలకవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.