NTPC | జ్యోతినగర్(రామగుండం), జూన్ 9: రామగుండం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్(సివిల్) పతాన్ రహీమాఖాన్ (48) బక్రీద్ పర్వదినంన ఆకాల మృతితో బీ థర్మల్ అధికారులు, ఉద్యోగులు, యూనియన్ నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ మేరకు సోమవారం బీ థర్మల్ విద్యుత్ కేంద్రం కాన్ఫరెన్సోల్లో అధికారి జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన సంతాప సభలో ఉద్యోగులు రెండు నిమిషాలు మౌనం పాటించారు.
అనంతరం వారు మాట్లాడుతూ ప్లాంటులో రహీమ్గాఖాన్ చేసిన సేవలను కొనియాడారు. ఇక్కడ బీ థర్మల్ విద్యుత్ కేంద్రం ఇన్చార్జి సూపరింటెండెంట్ దాసరి శంకరయ్య, ఆపరేషన్ అండ్ మెయింటెన్సీ డీఈ కే శ్రీనివాసరావు, ఈఈ సివిల్ సూర్యనారాయణరెడ్డి, డీఈ టీ కృష్ణామూర్తి, ఎవో వై అనిత, ఎఈఈ శశికాంత్, యూనియన్, అసోసియేషన్ నాయులు అబ్దుల్ నజ్మీ, టీ కృష్ణామూర్తి, అబ్దుల్ తఖీ, జహింగీర్ అహ్మద్, జీ నర్సింహాలు, శ్రీకాంత్, ఇంజినీరింగ్, సెంట్రల్ కార్యాలయ సిబ్బంది, ఆర్టిజన్లు ఉన్నారు.