కరీంనగర్ రూరల్, సెప్టెంబర్ 17: అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. నగరంలోని తీగలగుట్టపల్లిలో గల కేసీఆర్ భవన్లో ఆదివారం జాతీయ సమైక్యతా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. రాష్ట్ర ప్రజలకు జాతీయ సమైక్యతా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ పోరాట యోధులు, స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీరామకృష్ణారావు, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, మేయర్ యాదగిరి సునీల్‌రావు, మాజీ ఎమ్మెల్యే కోడూరి సత్యనారాయణగౌడ్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, పెండ్యాల మహేశ్, సంపత్, కొమ్ము భూమయ్య, దాసరి సాగర్, తుల బాలయ్య, పెండ్యాల శ్యాం సుందర్ రెడ్డి, జువ్వాడి రాజేశ్వర్‌రావు, సాయిల మహేందర్, మిడిదొడ్డి నవీన్, రాజు, ఆంజనేయులు, ప్రదీప్‌కుమార్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ రూరల్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, ఎంపీడీవో దివ్యదర్శన్‌రావు జాతీయ జెండా ఎగురవేశారు. కార్యాలయ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు.
కార్యాలయ సూపరింటెండెంట్ సంపత్‌కుమార్, ఎంపీవో జగన్మోహన్రెడ్డి, ఏపీవో శోభారాణి, పీఆర్ ఏఈ రమణారెడ్డి, టెక్నికల్ సిబ్బంది పద్మ, రాజు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తహసీల్ కార్యాలయంలో తహసీల్దార్ నవీన్‌కుమార్ జాతీయ జెండాను ఎగురవేశారు. నాయబ్ తహసీల్దార్ శంకర్, ఆర్ఐ రజినీకాంత్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేశారు. బొమ్మకల్‌లో ఉపసర్పంచ్ సత్యనారాయణ, దుర్శేడ్‌లో సర్పంచ్ గాజుల వెంకటమ్మ, ఉపసర్పంచ్ సుంకిశాల సంపత్‌రావు, వార్డు సభ్యులు, చేగుర్తిలో సర్పంచ్ చామనపల్లి అరుణ, గోపాల్‌పూర్‌లో సర్పంచ్ ఊరడి మంజుల, మొగ్దుంపూర్లో సర్పంచ్ జక్కం నర్సయ్య, మందులపల్లిలో సర్పంచ్ రాజమల్లు, నల్లగుంటపల్లిలో సర్పంచ్ సంతోష, ఉపసర్పంచ్ అంజయ్య, వార్డు సభ్యులు, చెర్లభూత్కూర్‌లో సర్పంచ్ దబ్బెట రమణారెడ్డి, ఉపసర్పంచ్, తాహెర్ కొండాపూర్‌లో సర్పంచ్ మడికంటి మమత, ఉపసర్పంచ్ శంకర్, సింగిల్ విండో డైరెక్టర్ మారుతి, వార్డు సభ్యులు, బహ్దూర్ఖాన్పేటలో సర్పంచ్ తప్పట్ల భూమయ్య జాతీయ జెండా ఎగురవేశారు. దుబ్బపల్లిలో సర్పంచ్ సిరిగిరి దుర్గా, ఫకీర్‌పేటలో సర్పంచ్ కటకం నందయ్య, జూబ్లీనగర్‌లో సర్పంచ్ రుద్ర భారతి, ఎలబోతారంలో సర్పంచ్ కట్ల లక్ష్మి, నగునూర్‌లో సర్పంచ్ ఉప్పుల శ్రీధర్, ఇరుకుల్లలో సర్పంచ్ బలుసుల శారద జాతీయ జెండా ఎగురవేశారు.
కార్పొరేషన్, సెప్టెంబర్ 17: తెలంగాణ ప్రాంతాన్ని రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థలో కలిపేందుకు ఎన్నో పోరాటాలు చేసిన స్వాతంత్య్ర యోధుల త్యాగాలు వెలకట్టలేనివని మేయర్ యాదగిరి సునీల్‌రావు పేర్కొన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్ జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కొమురంభీం తన అమరత్వంతో చరిత్రను సృష్టించగా, దొడ్డి కొమురయ్యతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణరెడ్డి, స్వామి రామానంద్ తీర్థ, భీమ్‌రెడ్డి నర్సింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ, ప్రతాపరెడ్డి ప్రజాకవి కాళోజి లాంటి మహనీయులు అందరూ పోరాటం చేశారని గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధిస్తుందని స్పష్టం చేశారు. అనతి కాలంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ గొప్ప పురోగతిని సాధించింది అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, బల్దియా పాలకవర్గ సభ్యులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అలాగే, నగరంలోని వివిధ పార్టీల కార్యాలయాల్లో జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెండా ఆవిష్కరించి వందనం చేశారు. అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
ముకరంపుర, సెప్టెంబర్ 17: టీఎస్ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ సరిల్ కార్యాలయంలో మహనీయుల చిత్రపటాలకు ఎస్ఈ వీ గంగాధర్ పూలమాలలు వేసి, జాతీయ పతాకాన్ని ఆవిషరించారు. డీఈ కాళిదాసు, తిరుపతి, రాజేశం, శ్రీనివాస్, అంజయ్య, కిరణ్‌కుమార్, అరవింద్, రఘుపతి, సంపత్‌కుమార్, నిర్మలాదేవి, వెంకట్‌నారాయణ, శ్రీహరి, ఇంజినీర్లు, జేఏవోలు పాల్గొన్నారు.
కొత్తపల్లి, సెప్టెంబర్ 17: కొత్తపల్లి పట్టణంలో మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, మండలంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరించారు. కమిషనర్ వేణుమాధవ్, కౌన్సిలర్లు వాసాల రమేశ్, మానుపాటి వేణుగోపాల్, గున్నాల విజయ-రమేశ్, కో ఆప్షన్ సభ్యుడు ఎండీ ఫక్రుద్దీన్, బీఆర్ఎస్ నాయకులు జెర్రిపోతుల శ్రీకాంత్, ఎస్కే బాబా, వేముల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో లైబ్రెరియన్ సరితారెడ్డి, సిబ్బంది మల్లయ్య, గౌతమి, లక్ష్మి, రవి, పవన్ , శశి, బీఆర్ఎస్ నాయకులు నరేశ్‌రెడ్డి, అజయ్, మోహన్, రజ్జు, శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ముకరంపుర, సెప్టెంబర్ 17: కరీంనగర్ వ్యవసాయ మారెట్ కమిటీలో చైర్మన్ రెడ్డవేణి మధు జాతీయ పతాకాన్ని ఆవిషరించి, డైరెక్టర్లు, అధికారులు, సిబ్బందితో కలిసి జెండా వందనం చేశారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ ఉప్పు రాజశేఖర్, డీఎంవో పద్మావతి, మారెట్ కమిటీ డైరెక్టర్లు కర్నాటి చలమయ్య, పబ్బతి రంగారెడ్డి, గుంటి రాజమల్లు, సోమిరెడ్డి లక్ష్మి రెడ్డి, గోలి మల్లయ్య, గంగాధర లస్మయ్య, గుండేటి అనిత, చంద్రపలల అంజయ్య, బోనాల జనార్దన్, మహ్మద్ మహముద్ పాషా, విజయ్‌కుమార్ ముందడా, శివనాథుని వెంకటేశ్వర్లు, మారెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పురుషోత్తం, అడ్తిదారులు, కొనుగోలు దారులు, హమాలీలు, పాల్గొన్నారు.