కార్పొరేషన్, సెప్టెంబర్ 17 : సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని బుధవారం ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. జిల్లాకేంద్రాల్లోని పార్టీ కార్యాలయాల్లో జిల్లా అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు జాతీయ జెండాలు ఎగురవేశారు.
తెలంగాణ అంటేనే త్యాగాల గడ్డ, పోరాటాల గడ్డ అని గుర్తు చేశారు. రాష్ర్టాన్ని దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిపిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతున్నదని, తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో కాంగ్రెస్ నియంతృత్వ పోకడలను ఎదురిద్దామని పిలుపునిచ్చారు. మళ్లీ కేసీఆర్ నాయకత్వంలో తిరిగి తెలంగాణను సంక్షేమబాటలో తీసుకెళ్దామని విజ్ఞప్తి చేశారు.