National Mental Health Day | చిగురుమామిడిలో ఘనంగా జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం
చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా మానసిక ఆరోగ్య విభాగం సైకాలజిస్ట్ దొండపాటి రమణాకర్ పాల్గొని విద్యార్థులలో మానసిక వ్యాధుల పట్ల అవగాహన కల్పించి, పొగాకు, ఆల్కహాల్, మత్తు పదార్థాల వల్ల విద్యార్థులు తమ భవిష్యత్ నాశనం చేసుకో రాదని వివరించారు.
National Mental Health Day | చిగురుమామిడి, అక్టోబర్ 10 : చిగురుమామిడి మండలంలోని చిన్న ముల్కనూర్ ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్)లో జాతీయ మానసిక ఆరోగ్య దినోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా మానసిక ఆరోగ్య విభాగం సైకాలజిస్ట్ దొండపాటి రమణాకర్ పాల్గొని విద్యార్థులలో మానసిక వ్యాధుల పట్ల అవగాహన కల్పించి, పొగాకు, ఆల్కహాల్, మత్తు పదార్థాల వల్ల విద్యార్థులు తమ భవిష్యత్ నాశనం చేసుకో రాదని వివరించారు.
ఒత్తిడి అనేది అనేక రకాల మానసిక వ్యాధులకు కారణమని, ఒత్తిడిని ఎదుర్కొనే 4-7-8 పద్ధతులు 3-3-3 పద్ధతులను జాకబ్సన్ ప్రోగెషన్ మసిల్ రిలాక్సేషన్ పద్ధతులను విద్యార్థులకు వివరించారు. విద్యార్థుల మానసిక సమస్యలకు టెలి మనస్ సేవలు అందుబాటులోకి వచ్చాయని 14416 నంబర్ కి కాల్ చేసి విద్యార్థులు వారి మానసిక సమస్యలకు పరిష్కారం కనుకోవచ్చని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హర్జిత్ కౌర్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

