Nanded tirupati Train | ముకరంపుర, ఆగస్టు 14 : కరీంనగర్ మీదుగా వెళ్లే నాందేడ్-తిరుపతి(07015), తిరుపతి-నాందేడ్(07016) ప్రత్యేక రైలు సర్వీసును దక్షిణ మధ్య రైల్వే అధికారులు వచ్చే ఏడాది మార్చి వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
ప్రస్తుతం ఉన్న రద్దీ దృష్ట్యా ప్రత్యేక రైలును పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఆదేశాల్లో పేర్కొన్నారు. రైలు సర్వీసు పొడిగించడంతో కరీంనగర్ నుంచి తిరుపతికి వెళ్లే వెంకటేశ్వర స్వామి భక్తులకు ప్రయాణ అవస్థలు కొంత మేర తప్పనున్నాయి.