కరీంనగర్ ఎడిషన్ పరిధిలో
ఘనంగా పదకొండో వార్షికోత్సవం
తిమ్మాపూర్ రూరల్, జూన్ 6 : తెలంగాణ ప్రజల మానస పుత్రిక ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక, పాఠక దేవుళ్ల ఆదరాభిమానాలతో పదకొండేళ్లు దిగ్విజయంగా పూర్తి చేసుకొని పన్నెండో వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా సోమవారం కరీంనగర్ ఎడిషన్ కార్యాలయం పరిధిలో వార్షికోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఆయా చోట్ల నమస్తే తెలంగాణ కుటుంబసభ్యులు కేకులు కోసి సంబురాలు జరుపుకున్నారు.
ఎడిషన్ కార్యాలయంలో జరిగిన ఉత్సవాల్లో కరీంనగర్ యూనిట్ మేనేజర్, బ్యూరో ఇన్చార్జి కే ప్రకాశ్‌రావు, కరీంనగర్, ఆదిలాబాద్ ఎడిషన్ ఇన్చార్జిలు, మిగతా విభాగాల ఇన్చార్జిలు, సిబ్బంది పాల్గొన్నారు.