Personality Development | సింగరేణి సంస్థ ఆర్జీ 2 ఏరియాలోని నర్గుండ్కర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ – 2 వ బ్యాచ్ జూన్ 18 నుండి జూన్ 21, 2025 వరకు 4 రోజుల పాటు అధికారులకు ఇన్హౌ స్ శిక్షణా కార్యక్రమం ప్రారంభమైంది.
ఈ కార్యక్రమానికి ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్య, జనరల్ మేనేజర్ (హెచ్ఆర్డీ) కార్పొరేట్ వెంకటరామిరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్, లీడర్షిప్, టీం వర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్, గోల్ అచీవ్మెంట్ వంటి అంశాలపై విస్తృతంగా శిక్షణ ఇవ్వబడుతుంది.
“ఇలాంటి శిక్షణా కార్యక్రమాలు మన అధికారులకు తమ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి, సమర్థవంతమైన నాయకత్వ నైపుణ్యాలను అలవర్చుకోవడానికి ఒక గొప్ప వేదికగా నిలుస్తున్నాయి. ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీ, కార్మిక సంబంధాల వాతావరణంలో మానవ వనరుల ప్రాభవాన్ని పెంచే కోణంలో ఈ శిక్షణ ఫలదాయకంగా నిలవాలని ఏరియా జనరల్ మేనేజర్ బి వెంకటయ్య అన్నారు.
“వర్క్ ప్లేస్‌లో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, టీం వర్క్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేవి ప్రతి అధికారిక పరిపక్వతకు మూలసూత్రాలు. ఈ నాలుగు రోజుల శిక్షణ ద్వారా అధికారులలో ఆత్మవిశ్వాసం పెరిగి, వారంతా తమ విధుల్లో మరింత ఉత్తమంగా రాణించాలని జనరల్ మేనేజర్ (హెచ్ఆర్డీ) కార్పొరేట్ వెంకటరామిరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం నిమ్ ఎస్డి.జవీద్ అక్మల్ హుస్సైనీ, ఎక్స్టర్నల్ ఫ్యాకల్టీ జగదీష్ తదితరులు పాల్గొన్నారు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్