Municipal workers | కలెక్టరేట్, జూన్ 16 : మున్సిపల్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషాకు వినతిపత్రం సమర్పించారు. మున్సిపల్ కార్మికులకు పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని, కనీస వేతనం రూ.26 వేలుగా నిర్ణయించాలని, 60 ఏళ్లు నిండిన కార్మికులకు సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక భద్రత కల్పించాలని సీఐటీయూ నాయకులు కోరారు. అలాగే కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. జూన్ 18, 19 తేదీల్లో మున్సిపల్ కార్యాలయాల ముందు, జూన్ 22న కలెక్టర్ కార్యాలయం వద్ద, జూన్ 30న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని నాయకులు కోడం రమణ, కాసర్ల శంకర్, గుర్రం అశోక్, బాలయ్య, దేవరాజ్ లు పిలుపునిచ్చారు.