Odela | ఓదెల, జూన్ 26 : ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో మొహరం వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఓదెల, కొలనూర్, కనగర్తి, గుంపుల, పొత్కపల్లి, నాంసానిపల్లి గ్రామాల్లో సాంప్రదాయం ప్రకారం పీరీలను నిలబెట్టారు. శుక్రవారం చివరి రోజు కావడంతో గ్రామాల్లోని ఇంటింటికి తిరగగా భక్తులు కూడకలు, దస్తీలు కట్టి మొక్కలు చెల్లించుకున్నారు.
మతసామరస్యానికి ప్రతీకగా మొహరం వేడుకలు నిలుస్తాయి. హిందూ, ముస్లిం అనే తేడా లేకుండా అన్ని కులాల వారు ఐక్యతతో, సోదర భావంతో పీరీల పండుగను జరుపుకున్నారు. పీరీలను అలింగనం చేసుకోవడం, ధూపం, సాంబ్రానీలను అతుక్కోవడం, విభూది బెట్టు పట్టుకోవడం, కొబ్బరి కుడుకలు వేసి తమ కోరికలు నెరవేరాలని, సంతానం కావాలని మొక్కుకున్నారు.