అత్యంత కీలకమైన కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుంచి రెండుసార్లు విజయం సాధించిన బండి సంజయ్‌కు ఆ పార్టీ పెద్దపీట వేసింది. అందరి అంచనాలకు అనుగుణంగానే.. ఆయనకు కేంద్ర మంత్రి పదవుల్లో చోటు దక్కింది. సొంత పార్టీలోనే అతన్ని అణచివేసేందుకు కుట్రలు కుతంత్రాలు జరిగినా.. వాటిన్నింటినీ దాటేస్తూ.. అంచలంచెలుగా పార్టీలో ఎదుగుతూ వచ్చారు. చిన్నప్పుడే రాష్ట్ర స్వయం సేవక్ సంఘ్‌లో సేవకుడిగా పనిచేసిన ఆయన, ఆ తదుపరి విద్యార్థి సంఘం నాయకుడిగా.. అర్బన్ బ్యాంకు డైరెక్టర్‌గా, కార్పొరేటర్‌గా.. పార్లమెంట్ సభ్యుడిగా అనేక విజయాలు సాధించి.. నేడు కేంద్ర మంత్రి హోదా దక్కించుకున్నారు.
-కరీంనగర్, జూన్ 9 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
బండి సంజయ్ బీజేపీలో అంచలంచెలుగా ఎదిగారు. సొంత పార్టీలోనే అతన్ని అణచివేసేందుకు అనేక కుట్రలు, కుతంత్రాలు జరిగాయి. చాలా విమర్శలు సైతం చేశారు. రాష్ట్రంలోనే కాదు.. సొంత జిల్లాలో సొంత పార్టీ నుంచే అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పార్టీ నుంచి, అలాగే కేత్రస్థాయిలో ఎదురైన ప్రతి అడ్డంకిని అధిగమించి.. పార్టీలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. పార్టీ పదవులు కాకుండా.. అతని రాజకీయ జీవితం ఆర్బన్ బ్యాంకు డైరెక్టర్ నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కార్పొరేటర్‌గా ప్రస్థానం సాగించి.. ఆ తదుపరి రెండుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా కరీంనగర్ నుంచి విజయం సాధించి.. నేడు కేంద్ర మంత్రిలో చోటు దక్కించుకున్నారు.
కరీంనగర్ లోక్‌సభ నుంచి ఎంపీగా విజయం సాధించి కేంద్ర మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న వారిలో బండి సంజయ్ మూడో వ్యక్తి. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1999లో విజయం సాధించిన సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆనాటి ఎన్డీఏ ప్రభుత్వంలో హోంశాఖ సహాయ మంత్రిగా పని చేశారు. అలాగే, ఈ నియోజకవర్గం నుంచే ఎంపీగా విజయం సాధించిన తొలి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 2004-2006 వరకు కేంద్ర ప్రభుత్వంలో కేంద్ర కార్మిక-ఉపాధి మంత్రిత్వ శాఖ, ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల మంత్రిత్వ శాఖలకు కేబినెట్ మంత్రిగా పని చేశారు. ఆ తర్వాత మళ్లీ బండి సంజయ్ అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. కరీంనగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయిన సంజయ్.. ఇదే పార్లమెంట్ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎంపీగా గెలిచి.. తన పట్టు నిరూపించుకున్నారు.
నాపై నమ్మకం ఉంచి కేంద్ర మంత్రి వర్గంలో చోటు కల్పించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. కార్యకర్తల కృషి ఫలితమే ఈ మంత్రి పదవి. ముఖ్యంగా నాపై నమ్మకం ఉంచి రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ ప్రజల వల్లే ఈరోజు కేంద్ర మంత్రిగా పనిచేసే వచ్చింది. మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, నియోజకవర్గ అభివృద్ధి కోసం వినియోగిస్తా. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరేదొకటే. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలను పకనపెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి. కేంద్ర మంత్రిగా రాష్ట్రాభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నా. తెలంగాణ ప్రజలు బీజేపీపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం.
-బండి సంజయ్, కేంద్ర మంత్రి
పేరు : బండి సంజయ్ కుమార్, పుట్టిన తేదీ : 11-7-1971
తల్లిదండ్రులు : (కీ.శే. బండి నర్సయ్య) – శకుంతల
కులం : మున్నూరుకాపు (బీసీ-డీ), భార్య : బండి అపర్ణ (ఎస్బీఐ ఉద్యోగిని)
పిల్లలు : సాయి భగీరత్, సాయి సుముఖ్
ప్రస్తుత బాధ్యతలు : కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
గతంలో చేపట్టిన బాధ్యతలు: