జగిత్యాల : జగిత్యాల గానకోకిల కళానికేతన్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని బీఆర్ఎస్ నాయకుడు, ఎమ్మెల్సీ ఎల్ రమణ( MLC Ramana ) సన్మానించారు. జగిత్యాల ( Jagtial ) క్యాంప్ కార్యాలయంలో కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన అధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఎలగందుల రవి, ప్రధాన కార్యదర్శిగా పుప్పాల అశోక్ కుమార్, న్యాయ సలహాదారులుగా ముసుకు దామోదర్ రెడ్డిని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు చిట్ల రవి, తోకల రమేష్ బాబు, జంగిలి గోపి, కుత్తలా రమణ, లలిత మనోహర్ రాజ్, ఎలిగేటి రాజేంద్ర ప్రసాద్, నాయకులు వొళ్ళలా గంగాధర్, తేలు రాజు తదితరులు పాల్గొన్నారు.