జగిత్యాల/ సారంగాపూర్, ఫిబ్రవరి 8 : నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆది, సోమవారం రెండు రోజులపాటు జగిత్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు షెడ్యూల్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం 5. 30 గంటలకు మల్యాల మండలంలోని కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్మించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30కు బీర్‌పూర్‌లోని లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు హాజరై కల్యాణోత్సవంలో పాల్గొంటారు. అనంతరం బీఆర్ఎస్వీ నాయకుడు జకుల వెంకట్ వివాహ రిసెప్షన్‌కు హాజరావుతారని నాయకులు తెలిపారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జగిత్యాల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం చేయనున్నారు.