గంగాధర, జూన్ 17: అకాల వానలతో దెబ్బతిన్న ప్రతిపంటకు ప్రభుత్వం పరిహారం అందిస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. అన్నదాతలు ఆందోళన చెందవద్దని సూచించారు. బాధ్యతలేని ప్రతిపక్షాల మాటలు నమ్మి ఆగంకావద్దని సూచించారు. రైతుబాంధవుడైన సీఎం కేసీఆర్ రైతాంగానికి న్యాయం చేస్తారని చెప్పారు. శనివారం మండలంలోని బూరుగుపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత మార్చిలో వడగండ్ల వానలతో చొప్పదండి నియోజకవర్గంలో దెబ్బతిన్న పంటలను సీఎం కేసీఆర్ పరిశీలించి ఎకరాకు 10 వేల పరిహారం ప్రకటించారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం మొదటి విడుత చొప్పదండి మండలంలో 952.33 ఎకరాలకు 95,23,300, రామడుగులో 1500.15 ఎకరాలకు 1,50,01,500, గంగాధరలో 102 4.33 ఎకరాలకు రూ.1,02,43,300, కొడిమ్యాలలో 118.28 ఎకరాలకు 11, 86, 000, మల్యాల లో 345 ఎకరాలకు 3, 45,000, బోయినపల్లిలో 15.35 ఎకరాలకు గానూ 1,53,500 మొత్తంగా 3,64, 52, 600 పరిహారాన్ని మంజూరు చేసిందన్నారు.
రెండో విడుతలో చొప్పదండి మండలంలో 5666.13 ఎకరాలకు గానూ 5,66, 61, 300, రామడుగులో 5528.08 ఎకరాలకు 5,52,80,800, గంగాధరలో 4539.11 ఎకరాలకు 4,53,91,100, కొడిమ్యాలలో 6174.00 ఎకరాలకు 6,17,40, 000, మల్యాలలో 4301 ఎకరాలకు 4,30, 10, 000, బోయినపల్లిలో 573.00 ఎకరాలకు 57,30,000 మొత్తంగా 26,78,13,200 పరిహారం విడుదల చేయాల్సి ఉన్నదని చెప్పా రు. సాధ్యమైనంత తొందరలో రైతుల ఖాతా ల్లో ప్రభుత్వం పరిహారం జమ చేయనున్నదని పేర్కొన్నారు. తెలంగాణలో రైతులను ఆగం చే స్తున్న కాంగ్రెస్, బీజేపీ నాయకులు వారి పా లిత రాష్ర్టాల్లో ఎకరాకు ఎంత పరిహారం ఇస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. ఇక్కడ వారు కళ్లులేని కబోదుల్లా మాట్లాడుతున్నారని ఆగ్ర హం వ్యక్త చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రామడుగు మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌రెడ్డి, కొక్కెరకుంట విండో చైర్మన్ ఒంటెల మురళికృష్ణారెడ్డి, సర్పంచ్ శేఖర్, ఎంపీటీసీ ప్రవీణ్, నాయకులు కలిగేటి లక్ష్మణ్, అజ్జు, లింగాల దుర్గయ్య, మ్యాక వినోద్, గంగాధర కుమార్, ద్యావ సంజీవ్, కవ్వంపెల్లి కొమురయ్య, గంగాధర నగేశ్, గుడిసె తిరుపతి పాల్గొన్నారు.