జగిత్యాల రూరల్, డిసెంబర్ 14: మిషన్ భగీరథ పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని 13, 31 వార్డుల్లో జరుగుతున్న మి షన్ భగీరథ ఇంటర్ కనెక్షన్, హౌస్ సర్వీస్ కనెక్షన్ పనులను ఎమ్మెల్యే బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పనుల్లో నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు దుమాల రాజ్‌కుమార్, 13 వార్డు నాయకులు కమల్, ఫెరో జ్, మొయీజ్, అజ్గర్, అజీజ్, అఖిల్, కుతుబ్, ఎ నగందుల మోహన్, దుమాల చంద్రం, రాజం, ఇమ్రాన్‌తోపాటు పలువురు పాల్గొన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన సభ్యులు
పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన మిత అయ్యాల్గార్ సంక్షేమ సంఘ సభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌ను బుధవారం తన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మిత అయ్యాల్ గార్ సంక్షేమ సంఘానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు. దీంతో ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సంఘ భవనానికి రూ.5లక్షల నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. తక్షనమే స్పందించి సంఘ భవనానికి నిధుల మంజూరుకు హామీ ఇచ్చిన ఎమ్మెల్యేకు మిత అయ్యాల్ గార్ సంక్షేమ సంఘ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
పలువురికి పరామర్శ
రాయికల్, డిసెంబర్ 14: పట్టణానికి చెందిన న్యాయవాది కొత్తపెల్లి రంజిత్ తండ్రి ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబ సభ్యులను, మండలంలోని భూపతిపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ మహిళా కార్యకర్త బొల్లె గంగు గుండెపోటుతో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ బుధవారం పరామర్శించారు. అలాగే గ్రామానికి చెందిన ఎస్ రాజ్‌కుమార్ అనారోగ్యంతో మరణించగా అతడి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇటీవల రాజ్ కుమార్ చికిత్స నిమిత్తం రూ.1.50 లక్షల ఎల్వోసీని సైతం ఎమ్మెల్యే అందజేశారు. ఎమ్మెల్యే వెంట జడ్పీటీసీ అశ్వినీ జాదవ్, సర్పంచ్ చంద్ర శేఖర్, వైస్ ఎంపీపీ మహేశ్వర్ రావు, నాయకులు దేవేందర్ రెడ్డి, రంజిత్, భూపతి, హరీశ్, గోపాలకృష్ణ, లక్ష్మణ్ పాల్గొన్నారు.