Seetha Payanam | యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun) డైరెక్షన్లో వస్తున్న తాజా చిత్రం సీతా పయనం (Seetha Payanam). అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్గా నటిస్తుండగా.. కన్నడ యాక్టర్ నిరంజన్ సుధీంద్ర హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని వాలైంటెన్స్ డే కానుకగా ఫిబ్రవరి 14న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈవెంట్లో అర్జున్ మాట్లాడుతూ.. సీతా పయనం అనేది ఒక్కరి ప్రయాణం కాదని అన్నాడు. నా కూతురును ఒక మంచి కథతో పాజిటివిటీ ఉన్న సినిమాతో పరిచయం చేయాలని అనుకున్నా. నా కూతురికి ఈ సినిమాను ఒక గిఫ్ట్‌లా ఇవ్వాలనుకున్నా. జనాలకు ఓ మంచి సినిమాను ఇవ్వాలనే బాధ్యతతో ఈ మూవీని ఎంతో నిజాయితీతో తీశాను. ఉపేంద్ర అన్న కొడుకు నిరంజన్ చాలా టాలెంటెడ్ పర్సన్. అతడు అభి పాత్రలో అద్బుతంగా నటించాడు. నా కూతురి గురించి నేను కాకుండా ప్రేక్షకులు చెప్పాలి. ఈ సినిమాలో తండ్రీ, కూతుళ్ల ట్రాక్.. ఈ క్రమంలో వచ్చే సీన్లు గొప్పగా ఉంటాయి. ప్రకాశ్ రాజ్ పాత్రను అందరూ లైక్ చేస్తారని చెప్పుకొచ్చాడు అర్జున్. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కించిన బంధాల విలువలను చాటి చెప్పే చిత్రమిదని అన్నాడు.
చీఫ్ గెస్ట్‌గా హాజరైన బ్రహ్మానందం మాట్లాడుతూ.. రియల్ జెంటిల్మెన్ అర్జున్ గురించి తాను ఈ ఈవెంట్‌కు వచ్చానన్నాడు . అర్జున్ డైరెక్ట్ చేసిన జై హింద్ 2 చిత్రంలో నేను నటించాను. అర్జున్ ఎప్పుడూ ఎవరినీ డిమాండ్ చేయరు. ఈ చిత్రంతో ఐశ్వర్యకు మంచి పేరు రావాలని.. ఎప్పడూ సౌమ్యుడిగా ఉండే అర్జున్ పేరును నిలబెట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
తనకు కేవలం ఓ సినిమా మాత్రమే కాదని.. ఇది తనకొక ఎమోషన్ అని చెప్పింది ఐశ్వర్య . ప్రేమ, కుటుంబం, విలువల గురించి చెప్పే సినిమా సీతా పయనం అని చెప్పుకొచ్చింది. అర్జున్ హోం ప్రొడక్షన్ బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్ ఇంటర్నేషనల్పై నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్‌కు మంచి స్పందన వస్తోంది. ఈ మూవీలో అర్జున్, కన్నడ యాక్టర్ ధ్రువ్ సార్జా కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నిరంజన్, ప్రకాశ్ రాజ్, కోవై సరళ, సత్యరాజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Ee fast phase life lo manam chala marchipotunnamu, so danni chupinchadame ee cinema core point. – #Arjunsarja #Seethapayanam pic.twitter.com/xAaHFlpW9K
— Mohan Kumar (@ursmohan_kumar) February 11, 2026
Reel stars met real stars at the star-studded night of #SeethaPayanam Grand Pre-Release Event#SeethaPayanam Pre-Release Event highlights ✨
🌍 Worldwide Release | FEB 14, 2026
Telugu | Kannada | Tamil | Malayalam | Hindi@akarjunofficial #AishwaryaArjun @NiranjanSudhi… pic.twitter.com/HcMA5a3KiS— Sree Raam Film International (@SreeRaamFilms) February 11, 2026
Rajpal Yadav | చెక్ బౌన్స్ కేసులో జైలుకు రాజ్‌పాల్ యాదవ్.. సల్మాన్, అజయ్ సహా సాయమందిస్తున్న బాలీవుడ్
SreeLeela | నటి నుంచి డాక్టర్‌గా.. మెడిసిన్ పట్టా అందుకున్న టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల