Nilave Movie | సౌమిత్ పోలాడి హీరోగా నటిస్తూ, సాయి కె. వెన్నంతో కలిసి దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘నిలవే’. శ్రేయాసి సేన్ కథానాయికగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో హర్ష చెముడు, సుప్రియా ఐసోలా కీలక పాత్రల్లో నటించారు. POV ఆర్ట్స్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కె. వెన్నం నిర్మించిన ఈ చిత్రం, ఫిబ్రవరి 13న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో బుధవారం మాదాపూర్‌లో చిత్ర యూనిట్ ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించింది.
ఈ వేడుకకు ప్రముఖ గాయని సునీత ముఖ్య అతిథిగా విచ్చేశారు. ట్రైలర్‌ను వీక్షించిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. “ఈ మధ్యకాలంలో చక్కటి భావోద్వేగాలు ఉన్న సినిమాలు తక్కువగా వస్తున్నాయి. కానీ ‘నిలవే’ ఆ లోటును తీర్చేలా ఉంది. ఇందులోని అద్భుతమైన ఫొటోగ్రఫీ, ఇంటెన్స్ మ్యూజిక్ నన్ను ఆకట్టుకున్నాయి. ‘సఖి’, ‘ఏ మాయే చేశావే’ వంటి క్లాసిక్ సినిమాల తరహాలో ఇది మంచి ఫీల్ గుడ్ మూవీ అవుతుందని నమ్ముతున్నాను. కీరవాణి గారు కూడా ఈ పాటలు విని ప్రోత్సహించడం సినిమాపై ఉన్న నమ్మకాన్ని పెంచుతోంది” అని ఆకాంక్షించారు.
ప్రేమకథల్లో మైలురాయి – హీరో సౌమిత్ పోలాడి
హీరో సౌమిత్ పోలాడి మాట్లాడుతూ.. “మెగాస్టార్ చిరంజీవి గారి స్ఫూర్తితో నటుడిగా మారాను. యాక్షన్ సినిమాల్లో ‘కేజీఎఫ్’ ఎంతటి ప్రభావం చూపిందో, లవ్ స్టోరీల్లో ‘నిలవే’ అంతటి గుర్తింపు పొందుతుంది. నిన్న నిర్వహించిన ప్రీమియర్ షోకు విశేష స్పందన లభించింది. ఫిబ్రవరి 13న ప్రేక్షకులు కూడా మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాను” అన్నారు.
కంటెంట్ నమ్మిన దర్శకుడు
దర్శకుడు సాయి కె. వెన్నం మాట్లాడుతూ.. “మాది కంటెంట్ నమ్ముకుని తీసిన సినిమా. సందీప్ రెడ్డి వంగా గారు చెప్పినట్లు ‘మన సినిమాను మనం నమ్మాలి’ అనే సూత్రాన్ని పాటిస్తూ ముందుకు వెళ్లాం. చిన్న బడ్జెట్ చిత్రమైనా భారీ స్థాయిలో అవుట్‌పుట్ ఇచ్చాం” అని తెలిపారు. సంగీత దర్శకుడు కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో కథతో పాటు సాగే 11 పాటలు ఉంటాయని, సంగీత ప్రియులకు ఇది ఒక విందులా ఉంటుందని పేర్కొన్నారు.
హీరోయిన్ శ్రేయాసి సేన్ మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో అతి పెద్దదైన తెలుగు ఇండస్ట్రీలో నాయికగా నటించినందుకు ఆనందంగా వుంది. ఈ సినిమా నేను అంగీకరించడానికి సంగీతమే ప్రధాన కారణం. డైలాగ్స్ కూడా ఫీల్ కలిగేలా వున్నాయి. జేన్జీ జనరేషన్ కు చెందిన మా జనరేషన్ సినిమా ఇది. ఈ సినిమా చూశాక ప్రేమ మీద మంచి అభిప్రాయానికి వస్తారని నమ్ముతున్నాను. ఇంత మంచి సినిమా చేసిన టీమ్ కు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని తెలిపారు.
మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ నాయక్ మాట్లాడుతూ.. చక్కటి ఫీలింగ్ తో కూడిన లవ్ స్టోరీ లో సంగీతం కీలకం. చక్కటి సంగీతాన్ని సమకూర్చాను. మా సంగీతాన్ని మెచ్చుకుని కీరవాణిగారి దగ్గరకు చేరేలా చేసిన సునీత గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇందులో 11 పాటలున్నా కథతో సాగేవే. వినసొంపుగా వుంటాయి. సంగీత ప్రేమకథా చిత్రాల్లో నిలవే చిత్రం కేజీఎఫ్ లాంటి సినిమా అని తెలిపారు.
నిర్మాత రాజ్ అల్లాడ మాట్లాడుతూ, నిన్ననే ప్రీమియర్ వేశాం. మంచి స్పందన వచ్చింది. చక్కటి మ్యూజికల్ లవ్ స్టోరీ. కొత్తవారైనా అందరూ బాగా నటించారు. హీరో కమ్ దర్శకుడు కూడా పాత్రలో లీనమై మురిపించాడు. ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతితిక సిబ్బంది పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని తెలిపారు.
ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత మాధురి, నటి సత్య శ్రీ, ఆర్ అండ్ ఎ ట్రావెల్స్ అనురాధా, ప్రవీణ కడియాల, ప్రొడ్యూసర్ గిరిధర్ రావు, నటుడు రూపేష్ తదితరులు మాట్లాడుతూ, బిగ్గెస్ట్ మ్యూజికల్ లవ్ డ్రామాగా రూపొందిన నిలవే చిత్రం, భావోద్వేగాలతో పాటు కొత్త ఆలోచనలతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారని వెల్లడించారు. చిత్రం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.
తారాగణం & సాంకేతిక నిపుణులు
నటీనటులు: సౌమిత్ రావు, శ్రేయాసి సేన్, హర్ష చెముడు, సుప్రియా ఐసోలా, రూపేష్ మారాపు, జీవన్ కుమార్ తదితరులు.
దర్శకత్వం: సౌమిత్ పోలాడి, సాయి కె. వెన్నం
నిర్మాతలు: రాజ్ అల్లాడ, గిరిధర్ రావు పోలాడి, సాయి కె. వెన్నం
సంగీతం: కళ్యాణ్ నాయక్
సినిమాటోగ్రఫీ: దిలీప్ కె. కుమార్
ఎడిటర్: సత్య.జి