దేవరకొండ, ఫిబ్రవరి 11 : దేవరకొండ మున్సిపాలిటీ ఎన్నికల్లో గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్ కారు గుర్తుపై పోటీ చేసిన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నాయకులు, మండలాల నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, సర్పంచులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు, అభిమానులందరికి బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవరకొండ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల గెలుపు ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు.