MLA Sanjay Kumar | రాయికల్, ఆగష్టు 22 : రాయికల్ మండలంలో పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఆలూరు, వీరాపూర్, ధర్మాజీ పేట్, తాట్లవాయి, దావన్ పల్లి, వస్తాపూర్, చింతలూరు, బోర్నపల్లి గ్రామాల్లో రూ.1.30 కోట్ల నిధులతో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు.
అనంతరం పనుల జాతర కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాల్లో పారిశుధ్య కార్మికులు, ఎక్కువ పని దినాలు ఉన్న ఉపాధి హామీ కూలీలను ఎమ్మెల్యే సత్కరించారు. రాయికల్ మండలం ధర్మాజిపేట్ లో మ్యాకల సరస్వతి-రాజిరెడ్డి,వస్తాపూర్ గ్రామానికి చెందిన రామావత్ లత-మోతీలాల్ ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మండల, గ్రామ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.