ఆపత్కాలంలో భరోసాగా..
వారం రోజులుగా గెరువు లేకుండా ఏకధాటిగా వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, నష్టం భారీగానే జరిగింది. పలువురి ఇండ్లు కూలిపోయాయి. పంటలూ దెబ్బతిన్నాయి.
- మూడు రోజులుగా క్షేత్రస్థాయిలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు
- ప్రభావిత ప్రాంతాల్లో ముమ్మరంగా సహాయక చర్యలు
- అధైర్య పడొద్దని, ఆదుకుంటామని ధైర్యం
- నష్టం అంచనాలో తలమునకలు
- వెనువెంటే మరమ్మతు
ఆపత్కాలంలో వర్షభాధితులకు ప్రజాప్రతినిధులు, అధికారులు కొండంత భరోసానిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అధైర్య పడొద్దని, ఏ కష్టమొచ్చినా ఆదుకుంటామని అభయమిచ్చారు. ప్రభావిత ప్రాంతాల్లో రక్షణ, పునరావాస, సహాయక చర్యలు చేపడుతూనే మరోవైపు నష్టం అంచనాలో తలమునకలయ్యారు. దెబ్బతిన్న పంటలు, రోడ్లు, కల్వర్టులు, వంతెనలు, చెరువు గండ్లను పరిశీలిస్తూనే ఎక్కడికక్కడ మరమ్మతులు చేస్తున్నారు. విద్యుత్, రవాణాను పునరుద్ధరిస్తున్నారు. శనివారం శంకరపట్నం, వీణవంకలో కల్వల ప్రాజెక్టు, దెబ్బతిన్న రోడ్లను మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్‌కుమార్‌తో కలిసి రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ పరిశీలించారు. వాగులో గల్లంతై నవాబుపేటకు చెందిన రాజయ్య మృతి చెందగా, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. రాయికల్ మండలంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత వేర్వేరుగా పరిశీలించి, వర్ష బాధితులను ఓదార్చి ధైర్యమిచ్చారు.
– రాజన్న సిరిసిల్ల, జూలై 29(నమస్తే తెలంగాణ)

వారం రోజులుగా గెరువు లేకుండా ఏకధాటిగా వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, నష్టం భారీగానే జరిగింది. పలువురి ఇండ్లు కూలిపోయాయి. పంటలూ దెబ్బతిన్నాయి. రోడ్లు, కల్వర్టులు, వంతెనలు దెబ్బతినడంతోపాటు చెరువులకు గండ్లు పడ్డాయి. ఇలాంటి పరిస్థితుల్లో బాధితులకు ప్రజాప్రతినిధులు ‘మేమున్నా’మనే భరోసానిస్తున్నారు. మూడు నాలుగు రోజులుగా ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ, అధికారులతో కలిసి ముమ్మరంగా రక్షణ, పునరావాస, సహాయక చర్యలు చేపడుతున్నారు. నేరుగా బాధితులను కలుస్తూ.. సర్కారు ఆదుకుంటుందని చెబుతూ అభయమిస్తున్నారు. అధైర్య పడొద్దని ధైర్యం చెబుతున్నారు.

రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. ముందుగా శంకరపట్నం మండలం కల్వల గ్రామంలోని ప్రాజెక్టును మండలి విప్ పాడి కౌశిక్‌రెడ్డి, మానకొండూర్, హుస్నాబాద్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, వొడితల సతీశ్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. గండి పడడం బాధాకరమని, ఈ ప్రాజెక్టును రీ డిజైన్ చేసి సరికొత్త ప్రాజెక్టును పునర్నిర్మిస్తామని చెప్పారు. అనంతరం వీణవంక మండలంలోని ఘన్ముక్ల, మల్లారెడ్డిపల్లిలో దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించారు. వాగులో గల్లంతై మృతి చెందిన చిగురుమామిడి మండలం నవాబుపేటకు చెందిన ఏడెల్లి రాజయ్య మృతదేహాన్ని హుస్నాబాద్ ప్రభుత్వ దవాఖానకు తీసుకురాగా, ఎమ్మెల్యే సతీశ్ కుమార్‌తో కలిసి అక్కడికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
- జగిత్యాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ పర్యటించారు. రాయికల్ పట్టణంలోని 6, 7, 8, 9, 1వ వార్డుల్లో ముంపు ప్రాంతాల్లో బైక్‌పై తిరుగుతూ బాధితులను నేరుగా కలిసి ధైర్యం చెప్పారు. ఆర్థిక సాయం అందజేశారు. అలాగే, దెబ్బతిన్న పెద్దచెరువు వద్ద అలుగుళ్ల బ్రిడ్జితోపాటు మత్తడిని పరిశీలించి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
- కరీంనగర్ జిల్లా వీణవంక మండలం ఘన్ముక్ల, మల్లారెడ్డిపల్లిలో దెబ్బతిన్న ప్రాంతాలను మండలి విప్ కౌశిక్‌రెడ్డి పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి న్యాయం చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు.
- రాయికల్ మండలంలోని చర్ల కొండాపూర్, ఇటిక్యాల, మూటపెల్లి, కొత్తపేట్, వడ్డెర కాలనీల్లో దెబ్బతిన్న చెరువు కట్టలు, ఇండ్లు, రోడ్లను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్గౌడ్తో కలిసి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత పరిశీలించారు. నష్టపోయిన గృహ యజమానులతోపాటు గ్రామస్తులకు ధైర్యం చెప్పారు. ఈ సందర్బంగా నష్టం అంచనా వేసి వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపాలని, తెగిపోయిన చెరువులు, గండి పడ్డ కల్వర్టులకు తాతాలిక మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించారు.
- రామగుండం సీపీ రెమో రాజేశ్వరి ముంపు ప్రాంతాల్లో పర్యటించారు. ఎన్టీపీసీ పట్టణంలోని మోమిన్నగర్, సుభాష్‌నగర్‌ను పరిశీలించారు. ముంపు బాధితులతో మాట్లాడారు. అనంతరం జెన్కోకు చెందిన యాష్‌పాండ్ వద్దకు వెళ్లి నాళాను పరిశీలించారు. నివాస ప్రాంతంలోకి వరద రాకుండా త్వరితగతిన మరమ్మతు చేపట్టాలని జెన్కో ఎస్ఈకి సూచించారు. అనంతరం పెద్దపల్లి మండలం గౌరీ గుండాల జలపాతాన్ని సందర్శించారు. ఈ నెల 26న సందర్శనకు వచ్చిన యువకుడు మృతికి గల కారణాలను తెలుసుకున్నారు. ప్రవాహం పూర్తిగా తగ్గిన తర్వాతే సందర్శనకు రావాలని, అప్పటివరకు ఎవరూ రావద్దని సూచించారు.
- సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కలెక్టర్ అనురాగ్‌జయంతి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, చైర్పర్సన్ జిందం కళ, కౌన్సిలర్లు శనివారం ముంపు వార్డులను సందర్శించి పారిశుధ్య పనులను పరిశీలించారు. బాధిత కుటుంబాలను పరామర్శించారు. మేమున్నామని భరోసా ఇచ్చారు. ఎల్లారెడ్డిపేటలో వర్షం కారణంగా కూలిపోయిన ఇండ్లను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పరిశీలించారు. తిమ్మాసికుంట తెగిపోవడంతో నష్టపోయిన పంట పొలాలను పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి పరిశీలించి నష్టపరిహారం అందేలా ప్రయత్నం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
- మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల్లో దెబ్బతిన్న పంటలను బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పరిశీలించారు. బాధితులకు దైర్యం చెప్పడంతో పాటు, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. అలాగే దెబ్బతిన్న రోడ్లు, వంతెనలకు సంబంధించి తాత్కాలిక ఏర్పాట్లు చేసి, ప్రజా రవాణాను పునరుద్ధరించాలని అధికారులను కోరారు.
జనంలోనే యంత్రాంగం
వర్షాల నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. జనంతో మమేకమై రక్షణ, పునరావాస, సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు నష్టం అంచనా వేసే పనిలో తలమునకలయ్యారు. దెబ్బతిన్న పంటలు, రోడ్లు, కల్వర్టులు, వంతెనలు, చెరువుల గండ్లను పరిశీలించడంతోపాటు వేగంగా తాత్కాలిక మరమ్మతులు చేస్తున్నారు. రవాణాతోపాటు విద్యుత్ సరఫరాను పునరుద్ధరిస్తున్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాల మేరకు ధర్మారం మండలం కొత్తూర్‌లో జ్వర సర్వే చేశారు. మరోవైపు అంటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి గ్రామంలోనూ పారిశుధ్య పనులు చేపడుతున్నారు. మురుగు కాలువలు శుభ్రం చేయించడంతోపాటు వాటర్ ట్యాంకులు, మంచినీటి బావుల్లో క్లోరినేషన్ చేస్తున్నారు. దోమలు వృద్ధి చెందకుండా బహిరంగ ప్రదేశాల్లో నిల్వ ఉన్న నీటిలో గంబూషియా చేపలు, ఆయిల్ బాల్స్ వేస్తున్నారు. వరదతో కొట్టుకొచ్చిన చెత్తాచెదారాన్ని క్లీన్ చేస్తున్నారు. బురదమయంగా మారిన ప్రాంతాల్లో చెత్తను తొలగించడంతోపాటు బ్లీచింగ్ పౌడర్ వేశారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

