హుజూరాబాద్ రూరల్, జూన్ 10: బీఆర్ఎస్ బలోపేతానికి కార్యకర్తలే బలమని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని గ్రామాలు, వార్డుల స్థాయిలో విస్తృతంగా నిర్వహించి లక్ష్యాన్ని సాధించాలని సూచించారు. మేరకు బుధవారం హుజూరాబాద్ పట్టణంలోని కేసీ క్యాంపులో ఉన్న ఎమ్మెల్యే ఆఫీస్‌లో పార్టీ ముఖ్య నాయకులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటరు నమోదు ప్రక్రియపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిఒకరూ ఓటరుగా నమోదు అయ్యేలా కృషి చేయాలని కోరారు.
బూత్ స్థాయిలో బీఎల్ఏలు చురుగ్గా పని చేసి ఓటరు జాబితాల సవరణ, పరిశీలన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈ నెల 12న జమ్మికుంటలోని ఎంపీఆర్ గార్డెన్లో నిర్వహించనున్న సభ్యత్వ నమోదు, ఎస్ఐఆర్ ఓటరు నమోదు, బీఎల్ఏ అవగాహన కార్యక్రమానికి మాజీ మంత్రి హరీశ్‌రావు, ముఖ్య నాయకులు హాజరవుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.