ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జమ్మికుంటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.
- హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి
- కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలి
- ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి
జమ్మికుంట, డిసెంబర్ 11: తనపై విశ్వాసం ఉంచి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి స్పష్టంచేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం జమ్మికుంటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో లేనప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని పేర్కొన్నారు.
ప్రజలకు అందుబాటులో ఉంటానని, ప్రతి గడపనూ తడతానని అన్నారు. కార్యకర్తలు అధైర్యపడవద్దని కష్టానష్టాల్లో అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యేగా తనను గెలిపించేందుకు ఎంతగా కష్టపడ్డారో.. పంచాయతీ ఎన్నికల్లో మీ గెలుపు కోసం అదేవిధంగా కష్టపడి గెలిపించుకుంటానని హామీ ఇచ్చారు. తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతుబంధుతో పాటు పండిన పంటకు బోనస్ వెంటనే అందించాలన్నారు. ఈ సమావేశంలో జమ్మికుంట చైర్మన్ తకలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్పర్సన్ పద్మ, కోటి, బీఆర్ఎస్ నాయకులు పింగిలి రమేశ్, పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

