హుజూరాబాద్ రూరల్, ఆగస్టు 6 : ‘కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే బాగుండె సారూ..’ అంటూ హుజూరాబాద్ దవాఖానలో రెండోసారి డెలివరీ అయిన ఇల్లందకుంట మండలం సిరిసేడుకు చెందిన జవ్వాజి దివ్య ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో తెలిపింది.
డెలివరీ వార్డులో ఉన్న దివ్య వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే ‘కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ ఫుడ్ వస్తుందా?’ అని అడుగగా ఆమె ఇలా మాట్లాడింది. “కేసీఆర్ అప్పుడే బాగుండె సారు.. నాకు ఇది రెండో కాన్పు. మొదటి కాన్పు ఈ దవాఖాన్లనే జరిగింది. అప్పుడు నాకు ఆడపిల్ల పుట్టింది.
డెలివరైన 24 గంటల్లోనే కేసీఆర్ కిట్టు, న్యూట్రిషన్ ఫుడ్‌తో పాటు రూ.13 వేలు వచ్చినయ్. ఇప్పుడు వాటి గురించి దవాఖాన సిబ్బందిని అడిగితే అవేవీ రావడంలేదంటున్నరు” అని చెప్పగానే ఎమ్మెల్యే మనకు మళ్లీ పాతరోజులు వస్తయ్ అంటూ నవ్యుకుంటూ అక్కడి నుంచి కదిలారు.