కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 23: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మెదక్ జిల్లా ఎర్రవెల్లిలోని ఆయన నివాసంలో ఆదివారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ యాదగిరి సునీల్‌రావు, బీఆర్ఎస్ నగరాధ్యక్షుడు చల్ల హరిశంకర్, బీఆర్ఎస్ కార్పొరేటర్లు కలిశారు.
కరీంనగర్ నగరపాలక సంస్థలో సాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, పార్టీ పరిస్థితులపై కేసీఆర్ వీరిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్లోనే కొనసాగుతామన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఐక్యంగా పోరాడుతామని తేల్చిచెప్పారు. ప్రజల్లో ఉంటూ సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టంచేశారు. నగరాభివృద్ధికి కలిసికట్టుగా కృషి చేస్తామని పేర్కొన్నారు.