కారు జోరుకు ప్రతిపక్షాలు బేజారు
పెద్దపల్లి నియోజకవర్గంలో కారు జోరుకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి రూపురేఖలు మారాయని చెప్పారు.
- అభివృద్ధి కావాలంటే బీఆర్ఎస్ను గెలిపించండి
- పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్‌రెడ్డి
- బీఆర్ఎస్లో బీజేపీ నేతల చేరిక గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించిన దాసరి
పెద్దపల్లి, నవంబర్ 8: పెద్దపల్లి నియోజకవర్గంలో కారు జోరుకు ప్రతిపక్షాలు బేజారవుతున్నాయని పెద్దపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దాసరి మనోహర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పెద్దపల్లి రూపురేఖలు మారాయని చెప్పారు. ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగాలంటే బీఆర్ఎస్ను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సుల్తానాబాద్ మండలం దుబ్బపల్లికి చెందిన బీజే పీ నాయకులు, మాజీ ఉప సర్పంచ్ పెండ్యాల తిరుపతిరెడ్డి, వార్డు మెంబర్ పెండ్యాల వెంకటరమణారెడ్డి, తుంగ మల్లయ్య, ఒలిపిరెడ్డి పోశెట్టి, ఎండీ హబీబ్, శంకర్, శ్రీనివాస్ తదితరులు బుధవారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్‌లో బీఆర్ఎస్లో చేరారు.
వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం ప్రతిక్షణం పరితపిస్తున్న బీఆర్ఎస్కు, కేసీఆర్‌కు ప్రజలు అండగా నిలువాలని అర్థించారు. తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధి, మళ్లీ అధికారంలోకి రాగానే చేపట్టే అభివృద్ధి, పనులు, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని గులాబీ శ్రేణులకు సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రావణ్ కుమార్, హనుమంతు, కరుణాకర్ రెడ్డి, రాజు, రామ కృష్ణ, మల్లారెడ్డి, షరీఫ్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

