రివర్ ఫ్రంట్ పనుల్లో వేగం పెంచాలి
కరీంనగర్ మా నేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి..నగరానికి అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంసృతిక, పురావస్తు శాఖల మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ నిర్దేశించారు. శుక్రవారం బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి మానేరు రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించారు
- కరీంనగర్‌కు అంతర్జాతీయస్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు తేవాలి
- ప్రతివారం పనుల పురోగతిపై నివేదించాలి
- స్పోర్ట్స్ స్కూళ్లల్లో అధికారులు తనిఖీలు చేపట్టాలి
- విజయ డెయిరీ తరహాలో నీరా డెయిరీని అభివృద్ధి చేయాలి
- సిరిసిల్ల, కరీంనగర్లో మినీ నీరా కేఫ్‌ల ఏర్పాటుపై
- ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
- రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
కార్పొరేషన్, డిసెంబర్ 23: కరీంనగర్ మా నేరు రివర్ ఫ్రంట్ నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలి..నగరానికి అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా గుర్తింపు లభించేలా చర్యలు చేపట్టాలని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంసృతిక, పురావస్తు శాఖల మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ నిర్దేశించారు. శుక్రవారం బీసీ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో కలసి మానేరు రివర్ ఫ్రంట్ పనులను పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించారు. అధికారులు పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మన చరిత్ర, సంసృతిని ప్రతిబింబించేలా పోచంపల్లి, ఎకశిలతో నిర్మితమైన యాదాద్రి, రామప్ప తరహాలో మానేరు రివర్ ఫ్రంట్‌కు గుర్తింపు తేవాలని సూచించారు. ఇరిగేషన్, పర్యాటక శాఖల అధికారులు నమన్వయంతో ముందుకెళ్లి పనులను గడువులోగా పూర్తిచేయాలని కోరారు.
ప్ర పంచంలో కొన్ని ప్రాంతాలు మాత్రమే పర్యాటకంగా ప్రాచుర్యం పొందాయని, కాని తెలంగాణలో అనేక ప్రాంతాలు పర్యాటకంగా అభివృద్ధి చెందాయన్నారు. కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేసి బోటింగ్ అకాడమీ, హా స్టల్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని విన్నవించా రు. 100 రోజుల్లోగా పనులను పూర్తి చేసేలా చూ డాలన్నారు. పనుల ప్రగతిని అధికారులు కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ప్రతి వారం వీడియో రూపంలో పంపించాలని ఆదేశించారు. అలస త్వం చేస్తే బాధ్యులపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు. రివర్ ఫ్రంట్ జీరో మెయింటెనెన్స్ ఉం డేలా చూడడంతో పాటు, డిజిటల్, లేజర్ లైటింగ్‌కు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. అవసరమైతే అదనంగా నిధులు వెచ్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. మానేరులో డ్రైయిన్, స్టోర్డ్ వాటర్ కలవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వరదతాకిడిని సైతం తట్టుకునేలా నిర్మించాలన్నా రు. అంతర్జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొని విజ యం సాధించేలా పిల్లలను తీర్చిదిద్దాలని, వారికి పౌష్టికాహారాన్ని అందించాలన్నారు.
క్రీడా వసతి గృహాల్లో బాలురు, బాలికలకు ప్రత్యేక వసతి, వాష్ రూంలు ఉండేలా చూడాలని ఆదేశించారు. భోజనాన్ని కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్ ఇతర అధికారులు తరచూ తనిఖీలు చేపట్టి పిల్లలతో భో జనం చేయాలని సూచించారు. ఇండోర్ మినీ స్టేడియాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులను ప్రో త్సహించాలని సూచించారు. జిల్లాలో శత శాతం క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వీటికి అవసరం మేరకు స్పోర్ట్స్ మెటీరియల్ అందిస్తామని ప్రకటించారు. కరీంనగర్ బైపాస్‌లో ఉన్న లికర్ గోదాంను అనువైన మరో భవనంలోకి మార్చాలని సూచించారు. పట్టణాల్లో నీరా బండ్ల ఏర్పాటుపై దృష్టిపెట్టాలన్నారు. కల్లు, నీరాతో ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో తాటి, ఈత వనాల ఏర్పాటుపై దృష్టిపెట్టారని గుర్తు చేశా రు. సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలలో మినీ నీరా కేఫ్‌లను ప్రారంభించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని మంత్రి ఆదేశించారు.
హరితహారంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో డాలర్ ట్రీ తాటి మొకలను నాటాలని ఆదేశించారు. రాష్ర్టాన్ని గుడుంబా రహితంగా తీర్చిదిద్దాలని ఆదేశించారు. గుడుంబా అమ్మే వారిపై పీడీ యాక్ట్‌లు అమలు చేయాలని, నకిలీ మద్యం సరఫరాపై నిరంతరం ఎక్సైజ్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కార్యక్రమంలో మేయర్ సు నీల్‌రావు, జిల్లా ఇన్‌చార్టి కలెక్టర్ గరిమా అగర్వాల్, అడిషనల్ కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్, శిక్షణ ఐఏఎస్ లెనిన్ వాత్సల్ టోప్పో, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, జిల్లా టూరిజం అధికారి వెంకటేశ్వర్లు, రాజేశ్వర్ రావు, స్పోర్ట్స్ డీడీ, అధికారులు ధనలక్ష్మి, సుజాత, హరికృష్ణ, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి రాజావీరు ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

