హైదరాబాద్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని, అవసరానికి మించి యూరియాతోపాటు ఇతర ఎరువులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వివిధ రాష్ర్టాల్లో ఎరువుల నిల్వల వివరాలను కేంద్రం మంగళవారం వెల్లడించింది. తెలంగాణలో 7.4 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, 8.05 లక్షల టన్నులు ఉన్నదని పేర్కొన్నది. ఇందులో 4.49 లక్షల టన్నులు విక్రయించగా, ఇంకా 3.56 లక్షల టన్నులు నిల్వ ఉన్నదని తెలిపింది. డీఏపీ కూడా 2.07 లక్షల టన్నులు అవసరం కాగా, 2.03 లక్షల టన్నులు ఉన్నదని పేర్కొన్నది. ఇప్పటికే ఇందులో 1.72 లక్షల టన్నులు విక్రయించగా, 31 వేల టన్నులు అందుబాటులో ఉన్నదని స్పష్టంచేసింది.