టెంపుల్ సిటీని అద్భుతంగా తీర్చిదిద్దుతాం
ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు.
- ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
- మంత్రి ఈశ్వర్
ధర్మపురి, నవంబర్ 23: ధర్మపురి క్షేత్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. కార్తీక మాసం ముగింపు సందర్భంగా బుధవారం ధర్మపురి గోదావరి నదీ తీరాన నిర్వహించిన ముగింపు హారతి, అనంత దీపోత్సవం కార్యక్రమాన్ని కన్నుల పండువగా నిర్వహించగా మంత్రి ఈశ్వర్ దంపతులు పా ల్గొని గోదావరికి హారతినిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ధర్మపురి దేవస్థానం అభివృద్ధి కోసం రూ.100కోట్లు కేటాయించగా, టెంపుల్‌సిటీగా అద్భుతంగా తీర్చిదిద్దేలా పను లు నడుస్తున్నాయన్నారు. పవిత్ర గోదావరిలో మురుగునీరు కలువకుండా రూ.8కోట్లతో మ హాడ్రైనేజీ నిర్మాణంతో మురుగునీటి సమస్య తీరిందన్నారు. అలాగే ప్రధాన దేవాలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయన్నారు. ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో ప్రధానం ఘట్టమైన పుట్టబంగారం సేకరణ స్థలం అభివృద్ధి, కోనేరుకు సాలాహారం దారి వెడల్పు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు.
విజయదశమి రోజు న శమీ పూజ నిర్వహిం చే జంబి గద్దె ఆధునీకరించుకున్నామన్నారు. గోదావరి తీరాన మంగ ళి గడ్డ వద్ద మరియు పుష్కరఘాట్ల వద్ద డార్మెటరీలను నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గోదావరి హారతి కోసం ప్రత్యేక వేదికను నిర్మిస్తామని తెలిపారు. ఇక్కడ దేవస్థానం ఈవో సం కటాల శ్రీనివాస్, మున్సిపల్ చైర్పర్సన్ సత్తె మ్మ, జడ్పీటీసీలు రాజేందర్, అరుణ, ఏఎంసీ చైర్మన్ రాజేశ్‌కుమార్, రెనొవేషన్ కమిటీ స భ్యులు ఇందారపు రామన్న, ఇనుగంటి రమావేంకటేశ్వర్రావ్, గందె పద్మశ్రీనివాస్, గునిశెట్టి రవీందర్, చుక్క రవి, సురేందర్ ఉన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

