మరోసారి ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చేస్తా
‘కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తున్నా. మరోసారి ఆశీర్వదిస్తే.. మరింత డెవలప్ చేసి చూపిస్తా’ అని మంత్రి గంగుల కమలాకర్ స్ప ష్టం చేశారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో బుధవారం పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మొ దట చింతకుంట రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.
- కరీంనగర్‌ను గొప్పగా తీర్చిదిద్దుతా
- స్వయంపాలనలో పల్లెల రూపురేఖలు మారాయి
- మంత్రి గంగుల కమలాకర్
- చింతకుంటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
కొత్తపల్లి, ఆగస్టు 16: ‘కరీంనగర్ నియోజకవర్గాన్ని మరింత గొప్పగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ విజయాలను కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తున్నా. మరోసారి ఆశీర్వదిస్తే.. మరింత డెవలప్ చేసి చూపిస్తా’ అని మంత్రి గంగుల కమలాకర్ స్ప ష్టం చేశారు. కొత్తపల్లి మండలం చింతకుంటలో బుధవారం పర్యటించిన ఆయన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. మొ దట చింతకుంట రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం గౌడసంఘం నూతన కార్యవర్గాన్ని ఘనంగా సన్మానించారు. ఆలయ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి రూ.10 లక్షలు, సీసీ రోడ్డు నిర్మాణానికి మరో రూ.5 లక్షలు కేటాయించారు.
గౌడన్నల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిషారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అక డి నుంచి శాంతినగర్‌కు చేరుకున్న మంత్రికి స్థానిక ఎంపీటీసీ భూక్యా తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో మహిళలు ఘన స్వాగతం పలికారు. డప్పుచప్పుళ్ల మధ్య సంత్ సేవాలాల్ ఆలయానికి చేరుకొని రూ. 10 లక్షలతో సంత్ సేవాలాల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఆలయంలో మేరిమా యాడి పతాకావిషరణ చేసి భోగ్ భండార్‌లో పాల్గొన్నారు. మేరి మా యాడిని దర్శించుకుని పూజలు చేశారు. ఆ తర్వాత సంత్ సేవాలాల్‌ను దర్శించుకున్నారు. బంజారా బిడ్డలకు దైవభక్తి ఎకువని, మేరీ మా యాడి కృపా కటాక్షాలతో సమస్త జనులు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
సంత్ సేవాలాల్ ఆలయ అభివృద్ధి కోసం సహాయసహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు. సమైక్యపాలనలో శాంతినగర్ మురుగుకూపంగా మారిందని, కానీ స్వయంపాలనలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్‌గా తీర్చిదిద్ది నట్లు చెప్పారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నానని, మరోసారి ఆశీర్వదిస్తే మరింత గొప్పగా అభివృద్ధి చేస్తానని ఉద్ఘాటించారు. అనంతరం చింతకుంట ప్రాథమిక పాఠశాలకు చేరుకొని, ‘మన ఊరు – మన బడి’ లో భాగంగా రూ.31.80 లక్షలతో చేపట్టిన కాంపౌండ్ వాల్, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం రూ.5లక్షలతో మైనార్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఇక్కడ ఎంపీపీ పిల్లి శ్రీలత మహేశ్, జడ్పీటీసీ పిట్టల కరుణ రవీందర్, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, ఎంపీడీవో ఏ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీటీసీ భూక్యా తిరుపతి నాయక్ పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
Anupama Parameswaran | డ్యాన్స్ షో ఆఫర్ వస్తే అనుపమ పరమేశ్వరన్ షాకయ్యిందట.. ఎందుకో తెలుసా.. ?
తెగులు మందు కొట్టడంతో క్షీణించిన వరి.. రూ.10 లక్షలు నష్టం?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

