ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కరీంనగర్ మెడికల్ కాలేజీ నిర్వహణకు లైన్ క్లియరైంది. తరగతుల నిర్వహణకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. గతంలోనే 100 సీట్లు మంజూరు చేసి, తాత్కాలిక బోధనకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం రూ.150 కోట్లు కేటాయించింది. తాజాగా ఎంసీఐ అనుమతులు ఇవ్వడంతోపాటు 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు తీసుకునేందుకు అవకాశం కల్పించగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– కరీంనగర్, జూన్ 7 (నమస్తే తెలంగాణ)
కరీంనగర్, జూన్ 7 (నమస్తే తెలంగాణ): కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్వహణకు లైన్ క్లియరైంది. ప్రతి జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో గతేడాది ఆగస్టులోనే రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌కు మెడికల్ కళాశాలను మంజూరు చేసింది. తరగతుల నిర్వహణకు అనుమతి కోరుతూ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపగా, గ్రీన్ సిగ్నల్ వచ్చింది. నీట్ పూర్తయిన నేపథ్యంలో 2023-24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు తీసుకునేందుకు అవకాశం కల్పించింది. ఆగస్టు నుంచి ప్రవేశాలు మొదలయ్యే అవకాశం ఉంది. కాగా మెడికల్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రూ.150 కోట్లు కేటాయించింది.
హామీ నిలబెట్టుకున్న కేసీఆర్..
గత ఎన్నికల్లో కరీంనగర్‌కు మెడికల్ కళాశాల ను మంజూరు చేస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్, ప్రస్తుతం నిలబెట్టుకున్నారు. గతేడాది ఆగస్టులో మెడికల్ కళాశాల మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. తరగతుల నిర్వహణ అనుమ తుల కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ప్రతిపాదనలు పంపించారు. సీఎం కేసీఆర్‌తోపాటు ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు, మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ అనునిత్యం పర్యవేక్షించారు. ఫలితంగా ఈ విద్యా సంవత్సరం నుంచే వంద సీట్లకు అడ్మిషన్లు స్వీకరించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు ఇచ్చింది. మౌళిక సదుపాయాల కోసం రూ.150 కోట్లు గతంలోనే మంజూరు చేశారు. ఇందులో రూ.7 కోట్లతో కొత్తపల్లిలోని సీడ్ గోదాముల్లో తరగతి గదులు నిర్మిస్తున్నారు. ఇప్పటికే మెడికల్ కళాశాలకు ప్రిన్సిపాల్, నలుగురు ఆఫీస్ సూపరింటెండెంట్లు, 16 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను ఇతర ఆఫీస్ సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
నెరవేరిన చిరకాల కల
కరీంనగర్ జిల్లా చిరకాల కోరిక నెరవేరింది. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సం ఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్ చాలా కా లంగా చేస్తున్న కృషి ఫలితం దక్కింది. గతేడాది నుంచే మెడికల్ కళాశాల ఏర్పాటు ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఒక పక్క కళాశాల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేసుకుంటూనే తరగతుల నిర్వహణకు మెడికల్ కౌన్సిల్ అనుమతికి ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం ఆ అనుమతులు సాధించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. మౌళిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.150 కోట్లు మంజూరు చేసింది. భవనాల నిర్మాణ బాధ్యతలను రోడ్లు, భవనాల శాఖకు అప్పగించగా, ఫర్నీచర్ సమకూర్చే బాధ్యతలను టీఎస్ఎంఎస్ఐడీసీ హైదరాబాద్‌కు అప్పగించింది. దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు తెలంగాణ వైద్య విధాన పరిషత్తు పరిధిలో ఉన్న కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన దవాఖానను డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మెడికల్ కళాశాల ఏర్పాటు తో అనుబంధ దవాఖానను అప్‌గ్రేడేషన్‌కు పరిపాలన అనుమతులు కూడా ఇచ్చింది.
ఎంసీఐ అనుమతులు వచ్చాయి..
కరీంనగర్లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అనుమతులు వచ్చాయి. ఇందుకు ఎంతో సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు, మంత్రి హరీశ్‌రావుకు ధ న్యవాదాలు. ప్రభుత్వ మెడికల్ కళాశాల అనేది కరీంనగర్ ప్రజల చిరకాలవాంఛ. దీనిని సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఆయన చొరవతో జిల్లాకు మెడికల్ కళాశాల రావడం మన అదృష్టంగా భావించా లి. ప్రస్తుత కరీంనగర్ ప్రభుత్వ దవాఖానాను బోధనాస్పత్రిగా మార్చి సేవలు అందిస్తాం. తద్వారా ప్రభుత్వ దవాఖానలో మరింత మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయి. అడ్మిషన్లు తీసుకుని తరగతులు ప్రారంభించడమే ఆలస్యం.
– గంగుల కమలాకర్, రాష్ట్ర మంత్రి
సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు
కరీంనగర్ మెడికల్ కళాశాలలో వంద సీట్లు భర్తీ చేసేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండి యా అనుమతులు రావడం సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మె డికల్ కళాశాల ఏర్పాటుతో గ్రామీణ, పట్టణ వి ద్యార్థులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. మెడిసిన్ చదవాలన్న విద్యార్థుల కోరికను సాకారం చేస్తుంది. ఇపుడు జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు కావడంతో సామాన్యులకు కూడా వైద్య వి ద్య అందుబాటులోకి వస్తుంది. ప్రభుత్వ కళాశాల నుంచి మంచి వైద్యులు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది.
– వినోద్‌కుమార్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు