MLA GANGULA KAMALAKAR | కార్పొరేషన్ మే 1 : మే డే సందర్భంగా కరీంనగర్ లో వివిధ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన మేడే వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మేడే వేడుకల్లో పాల్గొని జెండాను ఆవిష్కరించారు. అనంతరం బస్టాండ్ చౌరస్తా వద్ద గల బీఆర్టీయూ యూనియన్, ఆటో డ్రైవర్ యూనియన్ ల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మేడే కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
అనంతరం సుభాష్ నగర్ లో గల భవన నిర్మాణ కార్మిక సంఘం, వ్యవసాయ మార్కెట్లో గల హమాలీ సంఘం ఆధ్వర్యంలో, అంబేద్కర్ నగర్లోని ఐఎఫ్టియూ కార్పెంటర్స్ యూనియన్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మేడే వేడుకల్లో పాల్గొని జెండాలను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అందరి ఆశీర్వాదంతో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచానని, కార్మికుల సమస్యలను కృషి చేసేందుకు ఎల్లప్పుడు పోరాటం చేస్తానన్నారు. కేసీఆర్ సీఎంగా కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశారని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపట్టిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి కార్మికులను మోసం చేసిందని విమర్శించారు.
సంవత్సరన్నర కాలంగా కరీంనగర్ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికై మున్సిపల్ కార్మికులతో కలిసి త్వరలోనే జిల్లా కలెక్టర్ కు మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇయ్యనున్నట్టు తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, మాజీ కార్పొరేటర్లు మేచినేని అశోక్ రావు, కుర్ర తిరుపతి, బీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు దావ రాజమల్లు, పట్టణ అధ్యక్షులు సంపత్, మున్సిపల్ డ్రైవర్ యూనియన్ అధ్యక్షులు పొన్నం లింగయ్య, ఆటో డ్రైవర్ల సంఘం అధ్యక్షులు రాజేందర్, భవన నిర్మాణ సంఘం అధ్యక్షులు బొంకురి రాములు, అమరి సంఘం అధ్యక్షులు రమేష్, నాయకులు సంపత్ మల్లేశం కార్మిక సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు.