Odela | ఓదెల, జూన్ 16 : తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒకటైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నట్లు పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయరమణారావు తెలిపారు. ఓదెల మల్లికార్జున స్వామి ఆలయ పునరుద్దరణ కోసం రూ.10 కోట్ల నిధులు కేటాయించడంతో పాటు ఆలయ ప్రత్యేక నిధులు నుండి రూ.5 కోట్ల (మొత్తం రూ.15 కోట్లతో) అభివృద్ధి పరచడానికి ప్రణాళిక చేస్తున్నట్లు చెప్పారు.
ఈ మేరకు మంగళవారం మాస్టర్ ప్లాన్ ను హైదరాబాద్ బొగ్గులకుంటలోని ధార్మిక భవన్ అయిన దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులు, స్థాపతి తో సమీక్ష నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున స్వామి దేవాలయం పాలక మండలి చైర్మన్ చీకట్ల మొండయ్య, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి, ఆలయ ఈవో సదయ్య, డైరెక్టర్లు, ఆలయ అధికారులు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.