suicide | కాల్వ శ్రీరాంపూర్ మే 5 : మండలంలోని మల్యాల గ్రామ పరిధిలోని జగ్గయ్యపల్లెకు చెందిన ఉప్పుల శారద (23) సోమవారం ఉలేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఉప్పుల శారత గత కొన్ని సంవత్సరాల నుండి మానసికంగా బాధపడుతోంది. భర్త అజయ్ కుమార్ శారదను పలు ఆసుపత్రులు తీసుకెళ్లినా ఆమె జబ్బు నయం కాలేదు.
దీంతో మానసికంగా బాదపడుతుంది. ఇంట్లో ఎవరు లేని సమయంలో సోమవారం తెల్లవారు జామున ఇంటి ముందు ఉన్న రేకుల షెడ్డుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి మామిడి రామస్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెంకటేశ్ తెలిపాడు. మృతురాలికి కుమారుడు హిమాన్స్ ఉన్నాడు.