మానేరు రివర్ ఫ్రంట్‌ను అద్భుతంగా తీర్చిదిద్దుతాం
దేశంలోనే ఒక అద్భుతమైన గొప్ప పర్యాటక కేంద్రంగా మానేరు రివర్ ఫ్రంట్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి కరీంనగర్ శివారులోని కేబుల్ బ్రిడ్జిపై 6.50 కోట్లతో చేపట్టనున్న డైనమిక్ లైటింగ్ సిస్టం పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మానేరు రివర్ ఫ్రంట్‌ను కరీంనగర్‌కు మణిహారంలా తీర్చిది ద్దుతామన్నారు
- దేశంలోనే గొప్ప పర్యాటక కేంద్రంగా మార్చుతాం
- ఉగాది నాటికి కేబుల్ బ్రిడ్జి తీసుకువచ్చేందుకు కృషి
- ప్రపంచంలోనే అతిపెద్ద మూడో వాటర్ ఫౌంటేన్
- మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ కార్పొరేషన్, ఫిబ్రవరి 16 : దేశంలోనే ఒక అద్భుతమైన గొప్ప పర్యాటక కేంద్రంగా మానేరు రివర్ ఫ్రంట్‌ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. గురువారం మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌తో కలిసి కరీంనగర్ శివారులోని కేబుల్ బ్రిడ్జిపై 6.50 కోట్లతో చేపట్టనున్న డైనమిక్ లైటింగ్ సిస్టం పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మానేరు రివర్ ఫ్రంట్‌ను కరీంనగర్‌కు మణిహారంలా తీర్చిది ద్దుతామన్నారు. ఇప్పటికే కేబుల్ బ్రిడ్జి పనులు పూర్తయ్యాయని, అప్రోచ్ రోడ్డు పనులు కూడా తుది దశకు చేరాయని చెప్పారు. ఈ ఉగాదిలోగా అందుబాటులోకి తెచ్చే సంకల్పంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు. కేబుల్ బ్రిడ్జిపై జర్మనీ టెక్నాలజీతో డైనమిక్ లైటింగ్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు.
45 వేల పిక్సెల్స్ లైట్స్, 65 వేల కలర్స్‌తో కొత్త శోభ రానుందన్నారు. అంతే కాకుండా, కేబుల్ బ్రిడ్జి నుంచి ఇరువైపులా 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా స్పష్టంగా కనిపించేలా 10×30 అడుగులతో 4 స్రీన్లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ప్రత్యేక రోజుల్లో ఆరోజు ప్రత్యేకతను స్రీన్లపై ప్రదర్శించే అవకాశం ఉంటుందన్నారు. డైనమిక్ లైటింగ్ సిస్టమ్ పనులను ఈ ఉగాదిలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని తెలిపారు. మానేర్ రివర్ ఫ్రంట్‌లో ప్రపంచంలోనే చైనా, సియోల్ తర్వాత మూడో ఫౌంటేన్‌ను 60 కోట్లతో నిర్మిస్తున్నామన్నారు. ఇది 300 అడుగుల వెడల్పు, వంద అడుగుల ఎత్తులో ఉంటుందని తెలిపారు. ఈ ఫౌంటేన్‌లో వాటర్, ఫైర్, లేజర్ భీమ్స్, స్రీన్ ఉంటాయన్నారు. దీని నిర్మాణ పనులకు ఇప్పటికే టెండర్ కూడా పూర్తయిందని, త్వరలోనే ప్రారంభించి ఆగస్టులోగా పూర్తి చేస్తామన్నా రు.
కరీంనగర్ మానేరు రివర్ ఫ్రంట్ ఇండియాలోనే గొప్ప ప్రాజెక్టుగా నిలిచిపోతుందన్నారు. ఇం దులో విహారం కోసం బోట్లకు ఆర్డరిచ్చామన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా ఒకే చోట కేబుల్ బ్రిడ్జి, మానేరు రివర్ ఫ్రంట్, డైనమిక్ లైటింగ్ సిస్టం అందుబాటులో ఉండడం కలిసి వస్తుందన్నారు. గొప్పగా నిర్మాణమవుతున్న మానేరు రివర్ ఫ్రంట్‌లో భాగస్వాములమవుతామని ఇప్పటికే తాజ్ లాంటి ప్రసిద్ధ సంస్థలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే కరీంనగర్ రూపురేఖలు మారుతాయని చెప్పారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

