Kabaddi competitions | సారంగాపూర్, జనవరి 12 : స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద సేవాసమితి ఆధ్వర్యంలో సారంగాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో సోమవారం మండల స్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల నుండి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ప్రథమ స్థానంలో కోనాపూర్, ద్వితీయ స్థానంలో రేచపల్లి జట్లు గెలుపొందాయి. గెలుపొందిన క్రీడాకారులకు నిర్వహకులు బహుమతులను అందజేశారు.
ఈ క్రీడా పోటీల్లో మండల విద్యాధికారి కిశోర్, పీడీలు లక్ష్మణ్, వేణు, వివేకానంద సేవాసమితి నాయకులు పూడూరి శోభన్, ఉరుమల్ల రాజేంధర్ రెడ్డి, నాయకులు గుర్రాల రాజేంధర్ రెడ్డి, ఏలూరి గంగారెడ్డి, చేకూట శేఖర్, మానాల లక్ష్మినారాయణ, వెంకటరమణ, మరిపెల్లి రమేష్, లక్ష్మారెడ్డి, శ్రీధర్, రాజు, బేర మహేష్: పోలీస్ సిబ్బంది, ఆయా గ్రామాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.