పేదల బతుకులు మార్చే పార్టీ బీఆర్ఎస్
పేదల బతుకులు మార్చే పార్టీ బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కరీంపేట్, అంబాల్‌పూర్, ఇప్పలపల్లి, వంకాయగూడెం, చింతగుట్ట, తాడికల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- ఎన్నికల్లో కాంగ్రెస్ పన్నాగాలకు మోసపోవద్దు
- మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలి
- ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి రసమయి బాలకిషన్
శంకరపట్నం, నవంబర్ 16: పేదల బతుకులు మార్చే పార్టీ బీఆర్ఎస్ అని బీఆర్ఎస్ మానకొండూర్ అభ్యర్థి, ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని కరీంపేట్, అంబాల్‌పూర్, ఇప్పలపల్లి, వంకాయగూడెం, చింతగుట్ట, తాడికల్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ సీఎం అయ్యాక 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్నామన్నారు. గోదావరి నీళ్లు తెచ్చి మూడు పంటలు పండేలా చేసిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో రైతులకు రూ.14 వేల కోట్ల రుణమాఫీ చేసినట్లు వెల్లడించారు.
ప్రస్తుతం కాంగ్రెస్ నాయకుల పన్నాగంతోనే రుణమాఫీ ఆగిందని ఆరోపించారు. తాము తిరిగి అధికారంలోకి వచ్చాక ప్రతి రైతుకు రుణమాఫీ చేస్తామన్నారు. నియోజకవర్గంలోని 146 గ్రామాల్లో దళితబంధు పథకం ఇచ్చి తీరుతామన్నారు. ఈ నెల 20న జరిగే సీఎం కేసీఆర్ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ సందర్భంగా అంబాల్పూర్లో పలువురు ముదిరాజ్ కులస్తులు బీఆర్ఎస్లో చేరగా, ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాలకు వచ్చిన ఎమ్మెల్యేకు ప్రజలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, సీనియర్ నాయకుడు గడ్డం నాగరాజు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్, వైస్ ఎంపీపీ రమేశ్, సర్పంచుల ఫోరం మండల చైర్మన్ పల్లె సంజీవరెడ్డి, సర్పంచులు ముంజ వసంత, బైరి సంపత్, గుర్రం లత, కీసర సుజాత, ఎంపీటీసీలు గాండ్ల తిరుపతి, బొజ్జ కవిత, బుద్దార్థి వరలక్ష్మి, ఏఎంసీ వైస్ చైర్మన్ వీరస్వామి, విండోల చైర్మన్ సంజీవరెడ్డి, మధూకర్‌రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ రవి, సీనియర్ నాయకులు సతీశ్‌రెడ్డి, వెంకటేశం, సంపత్, సమ్మయ్య, శ్రీకాంత్, శ్యాంరావు, ఆదిత్య, మల్లేశం, సంపత్, శ్రీనివాస్, సంపత్‌రెడ్డి, రమేశ్, బీఆర్ఎస్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

