Congress Activists | తిమ్మాపూర్, జూన్ 08 : కాంగ్రెస్ అధిష్టానంపై మానకొండూర్ నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు గుర్రుగా ఉన్నారు. చివరి నిమిషం వరకు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి వస్తుందని ఆశించిన కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు చివరి క్షణంలో పదవి చేజారడంతో నైరాశ్యంలోకి వెళ్లిపోయారు. మంత్రి పదవి ఖాయమైంది అంటూ శనివారం రాత్రి జోరుగా ప్రచారం కావడంతో ఫాలోవర్లు ఆనందంతో, ఉత్సాహంతో రాత్రంతా వేడుకలు జరుపుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు మంత్రివర్గ విస్తరణలో భాగంగా తప్పకుండా మంత్రి పదవి వస్తుందని అందరూ ఊహించారు. అనుకున్నట్టుగానే చివరి క్షణం వరకు వచ్చినట్టే వచ్చింది.. కానీ తెల్లారేసరికి ఇతర నాయకుల పేర్లు రావడంతో అందరూ షాక్‌కు గురయ్యారు. చివరి క్షణం వరకు ఊరించి ఊసురుమనిపించడంతో ఎక్కడి వారు అక్కడ గప్ చుప్ అయ్యారు.
మాదిగ ఎమ్మెల్యేలను పోగేసి..
రాష్ట్రంలో ఉన్న మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను అందర్నీ ఏకతాటిపైకి చేసి తమ వర్గానికి మంత్రి పదవి కావాలని ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేలంతా పట్టు పట్టారు. అధిష్టానంపై ఒత్తిడి తేవడంతోపాటు, పలుసార్లు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. అలాగే అధిష్టానం దృష్టికి సైతం తీసుకెళ్లడంతో.. ముందు వరుసలోఉన్న కవ్వంపల్లి సత్యనారాయణకే పదవి ఖాయం అంటూ ముందు నుండి ఊహగానాలు వచ్చాయి. తీరా టైంకు అదే సామాజిక వర్గానికి అడ్లూరి లక్ష్మణ్ కు పదవి వరించడంతో మానకొండూరు కాంగ్రెస్ శ్రేణులు అంతా సైలెంట్ అయిపోయారు.
ఎవరిదో ‘హస్తం’ ఉందట..
ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు మంత్రి పదవి రాకుండా జిల్లాకు చెందిన ఇద్దరు బడా నేతల హస్తం ఉన్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విద్యార్థి దశ నుండి కాంగ్రెస్‌లోనే ఉన్నాడని.. అందుకే ఆయనకు ఇచ్చారని మరో ప్రచారంలో ఉన్నది. ఏదేమైనా మానకొండూరు నియోజకవర్గం చరిత్రలో ఓ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తాడనుకున్న కార్యకర్తలు, ప్రజలు, కవ్వంపల్లి అభిమానులకు ఆశాభంగం ఎదురయింది.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం పూర్తి