karimnagar | పెగడపల్లి: చేపల వేటకు వెళ్లి వస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన వ్యక్తి హఠాన్మరణంతో ఆ కుటుంబంలో విషాదం నింపింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పెగడపల్లి మండలం బతికపల్లి గ్రామానికి చెందిన మన్నె రాయనర్సు అనే వ్యక్తి ఆదివారం ఉదయం చేపల వేటకు చెరువులోకి వెళ్లాడు.
తిరిగి వస్తుండగా మార్గ మధ్యంలో పొలం గట్టు మీద పడి మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై కిరణ్ కుమార్ వివరాలు సేకరిస్తున్నారు. రాయ నర్సు మృతి కి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.