Porandla | తిమ్మాపూర్, మే 22 : రెండు రోజుల క్రితం వ్యవసాయ పనులకు వెళ్లి వడదెబ్బకు గురై తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామానికి చెందిన ఆరెల్లి పరశురాములు (62) చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. గత మూడు రోజులుగా ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతుండడంతో వ్యవసాయ పనులకు వెళ్లి రైతులు, కూలీలు, ఆయా వర్గాల ప్రజలు అతలాకుతలం అవుతున్నారు.
మంగళ వారం వ్యవసాయ పనులకు వెళ్లి వచ్చిన పరుశరాములు అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. ఆయనకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు.