చిగురుమామిడి, మార్చి 17 : హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్(BRS) చేసిన అభివృద్ధి పనులు ప్రజలకు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నాయకులపై అసత్య ఆరోపణలు మానుకోవాలని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. మండల కేంద్రంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అర్థరహితమైన ఆరోపణలు సృష్టిస్తూ, కాంగ్రెస్ నాయకులు పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆరోపణ చేయడం సరైంది కాదన్నారు. బీఆర్ఎస్ నాయకులపై ఆరోపణ చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు.
కాంగ్రెస్ ముసుగులో అవినీతికి పాల్పడిన నాయకుల బండారం బయటపెడతామన్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ తీరుపై ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాడుతామన్రనారు. సమావేశంలో బీఆర్ఎస్ మండల నాయకులు ఆకవరం శివప్రసాద్, సన్నిల్ల వెంకటేశం, ఎస్కే సిరాజ్, రామోజు కృష్ణమాచారి, బోయిని రమేష్, బెజ్జంకి రాంబాబు, బోయిని రమేష్, శ్యామకూర సంపత్ రెడ్డి, ముస్కుల కృష్ణారెడ్డి, గీట్ల తిరుపతి రెడ్డి, తాటికొండ సందీప్ రెడ్డి, బొట్ల రవీందర్ తదితరులున్నారు.