Kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, ఏప్రిల్ 18 : కాల్వశ్రీరాంపూర్ మార్కెట్ యార్డులో ప్రభుత్వం మార్కెఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో విప్ మాట్లాడారు. పంట మార్పిడీతో రైతులు అధిక లాభాలు ఆర్జించవచ్చని సూచించారు. వరి కంటే మొక్కజొన్న పంటలో రైతులకు అధిక లాభాలుంటాయని, రైతులు ఈ పంటపై దృష్టి సారించాలని సూచించారు.
అనంతరం మండలంలోని ఆయా గ్రామాలకు చెందిన 25 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాంమోహనాచారి, తహసీల్దార్ రాముడు, ఏఎంసీ చైర్మన్ రామిడి తిరుపతిరెడ్డి, వైస్ చైర్మన్ రాజమల్లు, ఏవో సంధ్య, సర్పంచ్ బంగారు రమేశ్, మాజీ ఎంపీపీ గోపగాని సారయ్యగౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, ఏఈవోలు తదితరులు పాల్గొన్నారు.