Lions Club | ధర్మారం, నవంబర్ 23: సిలిండర్ లీకై ప్రమాదవశాత్తు గుడిసె దగ్ధం కావడంతో పాటు సర్వం కోల్పోయిన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బుచ్చయ్య పల్లి గ్రామానికి చెందిన ఆవుల సదయ్య కుటుంబానికి ధర్మారం లయన్స్ క్లబ్ అండగా నిలిచింది. లయన్స్ క్లబ్ అధ్యక్షులు లయన్ ఇప్ప మల్లేష్ ఆధ్వర్యంలో ఆదివారం బాధిత కుటుంబానికి రూ.3వేల నగదుతో పాటు, బియ్యం బ్యాగ్, నిత్యవసర వస్తువులు, బట్టలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో డిస్టిక్ పీఆర్వో లయన్ తన్నీరు రాజేందర్, కార్యదర్శి లయన్ భూత గడ్డ రవి, కోశాధికారి లయన్ మిట్టపల్లి చంద్రకాంతరెడ్డి, వైస్ ప్రెసిడెంట్ లయన్ నాడెం శ్రీనివాస్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ లయన్ చింతపండు నర్సింగము, సభ్యులు లయన్ కడారి కుమార్ పాల్గొన్నారు.