Lucknow Super Giants : ఐపీఎల్లో ప్రతిసారి గట్టి పోటీనిచ్చే లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants) వచ్చే సీజన్‌కు పక్కాగా సిద్ధమవుతోంది. ఇప్పటికే కోచింగ్ యూనిట్‌ను పటిష్టం చేసుకున్న లక్నో.. ఇకపై కొత్త లోగోతో మైదానంలోకి దిగనుంది. లావెండర్ రంగులో లక్నో పట్టణం చరిత్రను ప్రతిబింబించేలా గరుగ్మంతుడు, కిరీటం, ఏనుగు బొమ్మతో రూపొందించిన లోగో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇంతకూ ఈ లోగోలోని బొమ్మల వెనకున్న మతలబు ఏంటో తెలుసా..?
లక్నో ఫ్రాంచైజీ కొత్త లోగో ఉత్తరప్రదేశ్.. లక్నో పట్టణ విశిష్టతను, స్ఫూర్తిగాథను చాటేలా సరికొత్తగా.. అభిమానులకు అమితంగా నచ్చేలా రూపొందించారు. తాజా లోగోలో శక్తివంతమైన గరుడు, కిరీటం, ఏనుగు బొమ్మలు ఉన్నాయి. గరుడ (గరుత్మంతుడు) చిహ్నం ధైర్యానికి ప్రతీక. సవాళ్లను స్వీకరించడం.. వెనక్కి తిరిగి చూడకపోవడం, ఉన్నత శిఖరాలకు చేరడాన్ని సూచిస్తుంది. లక్నో జట్టు అనుసరించే భయమన్నది ఎరుగని క్రికెట్‌ను, సమిష్టిగా ఆడితే అసాధ్యమైన లక్ష్యమంటూ ఉండదని చాటుతుంది.
Junoon hai, Toofan hai. Lucknow Super Giants ki ye ek nayi udaan hai 💙❤️ pic.twitter.com/xaLnnnZcwr
— Lucknow Super Giants (@LucknowIPL) February 24, 2026
కిరీటం విషయానికొస్తే దర్పం, బాధ్యతకు ప్రతీక. మైదానంలోకి దిగిన ప్రతిసారి లక్షలాదిమంది ఆశల్ని లక్నో జట్టు మోస్తుంది. లక్నో జెర్సీ ధరించడం ఎంతో గర్వకారణం. ప్రతిరోజు ఈ గౌరవాన్ని పొందాలని కిరీటం సూచిస్తుంది. కొత్త లోగుకు ఏనుగు బొమ్మ గుండెతో సమానం. బలం, తెలివి, ఓపిక, ఐక్యత.. ఈ లక్షణాలకు ప్రతిరూపమే ఏనుగు. ఫలితంతో సంబంధం లేకుండా సీజన్ సీజన్‌కు అభిమానుల నుంచి లభిస్తున్న నిరంతర మద్దతు, వారు చూపించే కృతజ్ఞతా భావానికి బొమ్మ ప్రతీక. క్లుప్తంగా చెప్పాలంటే లక్నో వీధులకు సబంధించిన లోగో ఇది. ఇంట్లో ఉండి క్రికెట్ మ్యాచ్‌లు చూసే కుటుంబాలు, ఏదో ఒకరోజు లక్నో జెర్సీ వేసుకోవాలని ఆశపడే యువతకు ఇది ప్రతిబింబిం. కొత్త లోగో.. ఈ ప్రాంత చరిత్ర, గౌరవం, ఐకత్య సందేశాన్ని చాటుతుంది.
Know more about our new identity: https://t.co/F7WelisYJp
— Lucknow Super Giants (@LucknowIPL) February 24, 2026
ఆర్పీఎస్జీ గ్రూప్ ఛైర్మన్, లక్నో ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గొయెంకా తమ కొత్త లోగోపై ఏమన్నారంటే.. ‘ఈ కొత్త లోగో మా ఫ్రాంచైజీ భావోద్వేగానికి సంబంధించినది. మొదటి రోజు నుంచి ఉత్రరప్రదేశ్, లక్నో ప్రజలు లక్నో సూపర్ జెయింట్స్‌కు తమ హృదయాల్లో స్థానమిచ్చారు. అభిమానుల నమ్మకం, ప్రేమకు కృతజ్ఞతగా ఈ సింబల్‌ను రూపొందించాం. ఉన్నత స్థానానికి చేరాలనే మా కలకు గరుడ ప్రతీక. మైదానంలోకి దిగిన ప్రతిసారి గర్వపడే ప్రదర్శన చేయాలని కిరీటం సూచిస్తుంది.
లక్నో ప్రాంత వైవిధ్యం, ద్రుఢత్వానికి ఏనుగు సంకేతం. ఈ లోగోను మార్పుకోసమే తీసుకురాలేదు. ఇదొక ప్రామిస్. లక్నో సిటీని, ఇక్కడి మూలాలను మేము ఎంతగా గౌరవిస్తామో ఈ లోగో చెప్పకనే చెబుతుంది. ప్రతి పరుగు, వికెట్, మైదానంలోని ప్రతి క్షణం.. అభిమానుల ఎమోషన్స్‌ను చూపిస్తాయి. ఈ కొత్త లోగో ఇకపై లక్నో జట్టు జెర్సీపై, కిట్లపై, డిజిటల్ ఫ్లాట్‌ఫామ్స్‌లోనూ కనిపించనుంది. మా ఫ్రాంచైజీ అధికారిక ప్రచార సంస్థలు.. కొత్త లోగోతో కొనసాగుతాయి’ అని సంజీవో వెల్లడించారు.
Lucknow Super Giants unveils their brand new logo ❤️🏏#LucknowSuperGiants #LSG #IPL2026 pic.twitter.com/tsurAoZb9H
— Indian Cricket News (@IndianCricNews) February 24, 2026
ఐపీఎల్లో 2022లో అరంగేట్రం చేసిన లక్నో సూపర్ జెయింట్స్ ట్రోఫీ కోసం నిరీక్షిస్తోంది. వరుసగా రెండుసీజన్లు ప్లే ఆఫ్ చేరిన ఎల్ఎస్జీ.. 17, 18వ సీజన్లలో నాకౌట్ దశకు ముందే టోర్నీ నుంచి నిష్క్రమించింది. పద్దెనిమిదో సీజన్ వేలంలో రూ. 27 కోట్ల రికార్డు ధరతో రిషభ్ పంత్‌ను కొనుగోలు చేసిన లక్నో.. అశించిన ఫలితాన్ని మాత్రం చూడలేదు. పంత్ సారథ్యంలోని ఆ జట్టు మొదట విజయాలతో అదరగొట్టింది.
కానీ, చివరకు ఆరు విజయాలతో ప్లే ఆఫ్స్ చేరలేదు. సో.. పంతొమ్మిదో సీజన్లో ట్రోఫీపై కన్నేసిన ఫ్రాంచైజీ కోచింగ్ యూనిట్‌ను పటిష్టం చేసుకుంది. కేన్ విలియమ్సన్ (Kane Williamson)కు వ్యూహాత్మక సలహాదారుగా, టామ్ మూడీ (Tom Moody)కి ‘గ్లోబల్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్’ (Global Director Of Cricket)గా కీలక బాధ్యతలు అప్పగించిన లక్నో.. స్పిన్ కోచ్‌గా కార్ల్ క్రొవే (Carl Crowe)ను తమ గూటికి తెచ్చుకుంది సంజీవ్ గొయెంకా టీమ్.