Lions Club | కోల్ సిటీ, జూన్ 25 : రామగుండం లయన్స్ క్లబ్ కు అనుబంధంగా మూడు క్లబ్ ల ద్వితీయ సంస్థాపన వేడుకలు గురువారం గోదావరిఖనిలో అట్టహాసంగా జరిగాయి. లయన్స్ క్లబ్ ఆఫ్ లక్ష్మీనగర్ పీ.ఎస్.టి లుగా అనుగం కృష్ణమూర్తి, ఆవునూరి శంకర్, చొక్కారపు వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాగా, లయన్స్ క్లబ్ ఆఫ్ గోదావరిఖని పీ.ఎస్. టి లుగా చిట్టిమల్ల కిశోర్, అల్లాడి నాగరాజు, చింతకింది కృష్ణ, లయన్స్ క్లబ్ వాసవి పీ. ఎస్.టి లుగా కొమురవెల్లి రాహుల్, ఇల్లెందుల శ్రీనివాస్, దొంతుల గంగాధర్ ఎన్నికయ్యారు.
ఈమేరకు సంస్థాపన చైర్మన్ లయన్ చంద్రమోహన్ నూతన పీ ఎస్ టి లతో ప్రమాణ స్వీకారం చేయించారు. రామగుండం లయన్స్ క్లబ్ సభ్యులు ఒక కుటుంబంలా పని చేయడం వల్లనే రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు, హోదా లభించిందన్నారు. ఇదే ఒరవడిని కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ ప్రతినిధులు హరికృష్ణ, ఆనందం, సాదుల వెంకటేశ్వర్లు, భాస్కర్, నార్ల ప్రసాద్, సోమారపు లావణ్య, సుధాకర్, డాక్టర్ లక్ష్మీవాణి, బంక రామస్వామి, రాజేందర్, చందర్, శ్రావణ్, వినోద్, నరేశ్, రత్నాకర్‌తో పాటు వివిధ ఏరియాల క్లబ్ బాధ్యులు పాల్గొన్నారు.