Chigurumamidi | చిగురుమామిడి, మే 12 : కాంగ్రెస్ పాలనలో శాంతి భద్రతలు అదుపుతప్పాయని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మామిడి అంజయ్య అన్నారు. చిగురుమామిడి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. హోం మంత్రి బండి సంజయ్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలన్నారు. రాష్ట్రంలో హత్యలు, హత్యాచారాలు, లైంగిక దాడులు జరుగుతుంటే హోం శాఖను తన వద్ద ఉంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోవడం దారుణం అన్నారు.
కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అవినీతిలో పయనిస్తుందన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బిఆర్ఎస్ నాయకులు ఏదైనా సోషల్ మీడియాలో పెడితే బీఆర్ఎస్ నాయకులను వెంటనే అరెస్ట్ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత పెద్ద ఘటన జరిగితే ఫిర్యాదు చేసి నాలుగు రోజులు గడిచినప్పటికీ అరెస్టు చేయకపోవడం దారుణమన్నారు. ఈ ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాలని, బాధిత కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మాజీ మండల అధ్యక్షుడు రామోజు కృష్ణమాచారి, మండల నాయకులు గీట్ల తిరుపతిరెడ్డి, మాంకాళి కొమురయ్య, బొట్ల రవీందర్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.