ముకరంపుర, ఏప్రిల్ 6: ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ తోటి ఉద్యోగుల వద్దే లక్షలాది రూపాయలు వసూలు చేసి మోసం చేసిన వ్యవహారం లో ఇద్దరు విద్యుత్ ఉద్యోగులపై ఉచ్చు బిగుస్తున్నది. తాజాగా ఓ బాధితుడి ఫిర్యాదుతో సైదాపూర్ సీనియర్ లైన్ఇన్స్పెక్టర్(ఎస్ఎల్ఐ) చెలుమల్ల తిరుపతిరెడ్డి, జేఏవో సయ్యద్ షకీల్ అహ్మద్‌పై సైదాపూర్ పోలీస్ స్టేషన్లో గురువారం కేసు నమోదైంది. తమకు జరిగిన మోసంపై ఇదివరకే బాధితులు నేరుగా ఎన్పీడీసీఎల్ సీఎండీని కలిసి ఫిర్యాదు చేశారు. తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు ఇప్పటికే ఈ ఇద్దరు ఉద్యోగులను స స్పెండ్ చేశారు. వసూళ్ల పర్వం విద్యుత్ శాఖను కుదిపేస్తుండగా… ఈ విషయమై విద్యుత్ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. బాధితులు, పోలీసుల వివరాల ప్రకారం…హుజూరాబాద్ వి ద్యుత్ డివిజన్లోని సైదాపూర్‌లో సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న చెలుమల్ల తిరుపతిరెడ్డి, జేఏవో సయ్యద్ షకీల్ అహ్మద్ ఫీల్డ్‌లో పనిచేస్తు న్న విద్యుత్ ఉద్యోగులను మెడికల్ అన్‌ఫిట్ చే యించి, వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇ ప్పిస్తామని నమ్మించారు.
సైదాపూర్ సబ్‌స్టేషన్‌లో లైన్మెన్గా పనిచేస్తున్న జమ్మికుంట మండలం ధర్మారం గ్రామానికి చెందిన రాముల సంపతిని కూడా అలాగే నమ్మించారు. కొడుకుకు ఉద్యోగం తో పాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్, ప్రతి నెలా పెన్షన్ వస్తుందని మాయమాటలు చెప్పి ఖర్చుల కోసం 2014 అక్టోబర్‌లో సంపతి నుంచి రూ.50వేలు, నవంబర్‌లో రూ.3.50లక్షలు తీసుకున్నారు. ఉ ద్యోగం గురించి అడిగిన ప్రతిసారి వస్తుందని చె బుతూ దాటవేశారు. ఏళ్లు గడిచినా సంపతి కొడు కు రాజేంద్రప్రసాద్‌కు ఉద్యోగం ఇప్పించలేదు. ఏళ్ల తరబడి విధులకు హాజరు కాకపోవడంతో ఎ న్పీడీసీఎల్ అధికారులు సంపతిని సర్వీ సు నుంచి రిమూవల్ చేశారు. కొడుక్కు ఉద్యోగం రాకపోగా పెద్ద మొత్తంలో డబ్బుతో పాటు ఉన్న కొలువు పో వడంతో సంపతి కుటుంబం రోడ్డున పడింది. ఇదే తరహాలో లింగాల సమ్మిరెడ్డి నుంచి రూ.5లక్షలు, నల్ల రాజేశ్ నుంచి రూ.40వేలు తీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంపతితో పాటు మిగతా బాధితులు బుధవారం తిరుపతిరెడ్డి ఇంటికెళ్లి ఉ ద్యోగాలు ఇప్పించాలని అడగగా దుర్భాషలాడు తూ తమను చంపుతానంటూ బెదిరించాడని వారు వాపోయారు. సంపతి ఫిర్యాదు మేరకు చెలుమల్ల తిరుపతిరెడ్డి, సయ్యద్ షకీల్ అహ్మద్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.