siricilla | సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 22 : సిరిసిల్ల నియోజక వర్గం లో నూతన సర్పంచ్ లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జ్ఞాపకలను అందజేశారు. ఈ మేరకు తంగళ్లపల్లి మండలం లో 16 గ్రామాల్లో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందిన విషయం తెలిసిందే.
సర్పంచ్ లు సోమవారం పదవీ బాధ్యతలు, స్వీకరించారు. ప్రమాణ స్వీకారం అనంతరం సెస్ చైర్మన్ చిక్కాల రామారావు, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గజ భీంకార్ రాజన్న, పార్టీ నేతలు కేటీఆర్ పంపించిన జ్ఞాపికలను అందించి, శాలువాలతో సన్మానించారు. ఇప్పటికే జిల్లాలో మూడు విడతల్లో గెలుపొందిన సర్పంచ్ లను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో తెలంగాణ భవన్ లోఆత్మీయ సన్మానం నిర్వహించిన విషయం తెలిసిందే.