Dharmaram | ధర్మారం, జూలై 24 : పెద్దపల్లి ధర్మారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) జన్మదిన వేడుకలు పార్టీ ఆధ్వర్యంలో నాయకులు శుక్రవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి తో పాటు పార్టీ తాజా మాజీ మండలాధ్యక్షుడు రాచూరి శ్రీధర్, ఏఎంసీ మాజీ చైర్మన్ కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఆర్బీఎస్ పూస్కురు రామారావు సంయుక్తంగా కేక్ కట్ చేసి కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. ఒకరికి ఒకరు స్వీట్లు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 50 వ జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు.
కేటీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని వారు గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్ క్యాబినెట్లో ఐటీ శాఖ మంత్రిగా పదవిని నిర్వహించి తెలంగాణ రాష్ట్రం వైపు ప్రపంచమే చూసే విధంగా ఐటీ శాఖను తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందని అన్నారు. కేటీఆర్ కృషి వలన ఎంతోమంది నిరుద్యోగ యువకులు ఐటీ శాఖలో ఉద్యోగాలు సాధించారని వారు అన్నారు. పట్నం నుండి పల్లెల వరకు ఐటీని విస్తరింప చేయడంలో కీలక పాత్ర పోషించారని ప్రతి జిల్లాలో ఐటీ హబ్ లు ఏర్పాటు చేసి గ్రామీణ యువతకు ఉపాధి కలిగేలా చేశారని వారి యొక్క సేవలను కొనియాడారు. నిరుపేద విద్యార్థులకు వారి ఉన్నత చదువుల కోసం ఎంతో మందికి మానవతా ధృక్పథంతో ఆర్థిక సహాయం అందించి వారిని ఉన్నత స్థాయిలో ఎదగడానికి వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నంది మేడారం ప్యాక్స్ వైస్ చైర్మన్ సామంతుల రాజ మల్లయ్య, ఖిలావనపర్తి, మల్లాపూర్ సర్పంచులు మోతే కనకయ్య, మంద శ్రీనివాస్, మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఎండి రఫీ, మాజీ సర్పంచులు జనగామ అంజయ్య , ఆడవాల అరుణ జ్యోతి రవి ,మాజీ ఎంపీటీసీ సభ్యులు తుమ్మల రాంబాబు, దాడి సదయ్య, బొడ్డు రాములు, ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ కోమటిరెడ్డి మల్లారెడ్డి, పార్టీ అనుబంధ మాజీ మండలాధ్యక్షులు దేవీ నళినికాంత్, దేవి వంశీకృష్ణ, శాయంపేట, కొత్తూరు గ్రామాల పార్టీ మాజీ అధ్యక్షులు బొలిశెట్టి సుధాకర్, బానోతు శ్రీనివాస్ నాయక్ ,పార్టీ నాయకులు సల్వాజీ మాధవరావు, కూరపాటి శ్రీనివాస్, నాడెం శ్రీనివాస్, గంధం తిరుపతి, బండవరం సుమన్, అర్ధవెల్లి రామ్ చందర్, రాగుల చిన్న మల్లేశం, బోయిని మల్లేశం, దేవి అజయ్,వేల్పుల కుమార్, ఎండి అఫ్రోజ్, ఆకారి సత్యం ఆవుల శ్రీనివాస్, ఆవుల వేణుగోపాల్,బ రుపటి చిలుకయ్య,పులి నవీన్, మహిళా నాయకురాలు కాంపల్లి అపర్ణ, మార్క సంధ్య, మర్రి మమత, సరమ్మ తదితరులు పాల్గొన్నారు.